మామూలుగా పాముల కుబుసము  వదులుతాయి అనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఎవరైనా వ్యక్తులు కుబుసం వదలడం ఎప్పుడైనా చూసారా... మనుషులు కుబుసం వదలడం ఏంటండి.. మనుషులు ఏమైనా పాముల అంటారా. ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం పాములాగా  కుబుసం వదులుతున్నాడు. పావు పెరిగే క్రమంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి చర్మంపై పొరను విడుస్తూ ఉంటుంది. చర్మం విడువక పోతే పెరుగుదల ఆగిపోతుంది. ఇక్కడ ఓ వ్యక్తి కూడా ఇలాగే చర్మాన్ని విడుస్తూ ఉన్నాడు. వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజ జీవితంలో జరిగిన ఘటన. ఇక్కడున్న ఓ  బాలుడు రోజురోజుకి పొడిబారి పోవటంతో పాటు ... అతడి చర్మం రోజు రోజుకి నల్లగా  పాములాగా పొరలుపొరలుగా మారిపోతుంది. శరీరమంతా పొడిబారిపోతుంది కొంచమైనా చెమట పట్టదు. 

 


 ఈ ఘటన ఒడిషాలోని గంజాం జిల్లాలో జరిగింది. ఆ బాలుడి చర్మం రోజురోజుకూ మారుతున్న తీరు అక్కడ స్థానికంగా చర్చనీయాంశమైంది. గంజాం జిల్లాలో జగన్నత్  అని పదేళ్ల బాలుడు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే ఆ బాలుడు పాముల కుబుసము  వదులుతున్నాడు అని చెప్పడం కంటే... నూటికో కోటికో ఒకరికి వచ్చే వింతైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు అనడమే కరెక్ట్ . అయితే సదరు బాలుడు పుట్టేటప్పుడు అతనిలో ఎలాంటి సమస్య కనిపించలేదు. కానీ సదరు బాలుడు పెరిగి పెద్దవుతున్న కొద్దీ అతనిలో మార్పు కనిపించడం చర్మంలో  కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. 

 


 అతని చర్మం ఎప్పుడూ పొడిబారిపోయి బిగుసుకుపోతుంది. అంతేకాదు నెలకొకసారి ఆ చర్మం పొరలు పొరలుగా ఊడిపోతుంది. ఇక అలా చర్మం గట్టిగా బిగుసుకుపోవడం కారణంగా సదరు పదేళ్ల బాలుడు  నవ్వలేని దుస్థితి కూడా ఉంది దీంతో 10 ఏళ్ల బాలుడు ఏకంగా కర్ర సహాయంతో నడుస్తున్నాడు . ఇక అతడు చర్మం పొడిబారకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లో భాగంగా స్కిన్  లోషన్లు  కూడా రాసుకుంటూ ఉంటాడు. అయితే ఈ వ్యాధికి మందు లేదు అని వైద్యులు చెబుతున్నారు. నివారణ ఒక్కటే మార్గం అంటూ అతడు డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఓ వైపు ఆ బాలుడు కుటుంబం కూడా ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉండడంతో వైద్యం అందించలేక పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: