ఏవైనా వస్తువులను దొంగలు ఒకసారి ఎత్తుకెళ్లారు అంటే అది మళ్ళీ కంటికి కనిపించడం అనేది  అసాధ్యం అని చెప్పాలి. ఎక్కడ కంటికి కనిపించకుండా ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ ఎవరైనా దొంగలు ఒక వ్యక్తి వస్తువు  ఎత్తుకెళ్లిన తర్వాత అది తిరిగి మళ్ళీ మన దగ్గరికి వచ్చింది అంటే.. అది  నిజంగా అదృష్టం అని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తికి ఇలాంటి అదృష్టమే పట్టింది. ఇక్కడ ఓ వ్యక్తి బైక్ ను  దొంగలు ఎత్తుకెళ్లారు. ఇక తన బైక్ పోయిందని  ఎంతో బాధ పడుతున్న సమయంలో తన బైక్ మళ్లీ కొరియర్ ద్వారా తిరిగి వచ్చేసింది. పోయింది అనుకున్న బైక్ మళ్ళీ తిరిగి వచ్చేసరికి అతని ఆనందం అంతా ఇంతా కాదు.ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎగిరి గంతేసాడు  అని చెప్పవచ్చు. తమిళనాడులో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. బైక్ ఎత్తుకెళ్లిన దొంగలు పోలీస్ కేస్ కి భయపడి మళ్ళీ ఆ బైక్ ను కొరియర్ సర్వీస్ ద్వారా యజమానికి పార్సల్ చేశారు. 

 

 

 వివరాల్లోకి వెళితే... కోయంబత్తూర్ కు చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తి మే 18వ తేదీన లేత్  వర్క్ షాపు ముందు బండి ని పార్క్ చేసాడు.. అయితే మధ్యాహ్నం వచ్చి చూసే సరికి సదరు  బైక్ కాస్త కనిపించలేదు. దీంతో కంగారుపడ్డ  సురేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు మాత్రం ప్రస్తుతం కరోనా  వైరస్ కారణంగా ఈ బైక్ గురించిన కేసును దర్యాప్తు చేయలేకపోయారు. దీంతో సదరు లేట్ వర్క్ షాప్ కి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓ యువకుడు  బైక్ ఎత్తుకెళ్లి నట్లు గుర్తించాడు. దీంతో సదరు సీసీటీవీ ఫుటేజీలను సోషల్ మీడియా లో వాట్సాప్ లో ప్రచారం చేశాడు. ఇక ఈ సిసి టివి ఫుటేజ్ లు  చూసిన కొంతమంది వ్యక్తులు బైక్ ఎత్తుకెళ్లిన  వ్యక్తి పేరు ప్రశాంతి అని అతడు ఒక బేకరీలో పని చేస్తూ ఉంటాడు అంటూ సమాచారం అందించారు. 

 

 దీంతో బైక్ దొంగిలించిన వ్యక్తి సమాచారం తెలుసుకుని ఇంటికి  వెళ్లగా సదరు వ్యక్తి ఇక్కడ ఉండడం లేదని ఊరికి వెళ్ళిపోయాడు అంటూ పక్కింటి వారు చెప్పారు. సొంతూరికి వెళ్ళిన ప్రశాంత్ కు తాను దొంగిలించిన బైక్ ఓనర్ తన గురించి గాలిస్తున్నట్లు తెలిపారు... పోలీసు కేసు పట్ల కాస్త భయాందోళనకు గురయ్యారు. దీంతో బైక్ లో రిజిస్ట్రేషన్  పేపర్ లోని అడ్రస్ ప్రకారం సదరు బైకును  కొరియర్ ద్వారా పార్సల్  చేశాడు ప్రశాంత్. ఇక ఓ రోజు ఏకంగా కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ అందుకున్న  సురేష్ మీ బయటకు తీసుకెళ్లి అంటూ అధికారులు చెప్పడంతో ఆశ్చర్యపోయాడు డెలివరీ తీసుకున్న తర్వాత అది తన బైక్ అని  గుర్తించి ఆనందం  పట్టలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: