ఆరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా అనంత‌రం తుఫాన్‌గా మారి తీరం వైపు దూసుకొస్తున్న‌ది. ఉత్త‌ర మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ తీర ప్రాంతాల్లో ఈ తుఫాను తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఐఎండీ అధికారులు ఈ తుఫానుకు నిస‌ర్గ అని పేరు కూడా పెట్టారు.  ఇప్పటికే దేశాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తుంది.. ఇది చాలాదన్నట్టు మొన్నటి వరకు అంఫాన్ తుఫాన్ అతలాకుతలం చేసింది.  ఇప్పుడు కొత్తగా సర్గ తుఫాన్  ఒకటి మొదలైంది. ఇలా వరుస ప్రకృతి విపత్తులు.. వైరస్ లతో జనాలకే కాదు అటు ప్రభుత్వానికి కూడా కంటిమీద కునుకు లేకండా పోతుంది. 

IHG

గత రెండు నెలలుగా కరోనా వైరస్ దేశాన్ని పట్టిపీడిస్తోంది.  ముఖ్యంగా కరోనా వైరస్ మహారాష్ట్రలో విలయతాండవం చేస్తున్నది.  అత్యధిక కేసులు, మరణాలు రెండు కూడా మహారాష్ట్రలోనే ఉండటం విశేషం.  ఒకవైపు కరోనా వైరస్ ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు వాతవరణం కూడా ఇబ్బందులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నది. ఇటీవలే అంఫన్ తుఫాను వెస్ట్ బెంగాల్ ను అతలాకుతలం చేసింది.  దీని నుంచి వెస్ట్ బెంగాల్ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది.  కాగా, ఇప్పుడు మరో తుఫాన్ మహారాష్ట్రను అతలాకుతలం చేసేందుకు సిద్ధం అవుతున్నది.  అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది.

IHG

ఈ నిస‌ర్గ తుఫాను జూన్ 3న తీరాన్ని తాకే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ వెల్ల‌డించ‌డంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వివిధ విభాగాల ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. NDMA, NDRF, IMD, ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన సీనియ‌ర్ అధికారుల‌తో స‌మావేశ‌మై తుఫాను ప్ర‌స్తుత స్థితి, దాని ప్ర‌భావం, తీసుకోవాల్సిన ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఇదిలా ఉంటే..  భారత్‌లో రుతుపవనాల ఆగమనం ముందుగా కేరళ నుంచే మొదలవుతుందనే సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 15న తొలి దశలో అంచనా వేసినదాని ( Weather forecast ) ప్రకారం జూన్-సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా 100 శాతం వర్షపాతం నమోదవుతుందని.. రేపు రుతుపవనాల రెండో దశ నివేదికను విడుదల చేస్తామని డా మొహాపాత్రా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: