విజయసాయిరెడ్డి వైసీపీకి పెట్టని కోట. ఆయన పార్టీకి ఓ విధంగా తనదైన సేవలు చేయడమే కాదు, జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. విజయసాయి రాజ్యసభ సభ్యుడిగా  ఢిల్లీకి వెళ్లాక మొత్తం సీన్ మారిందని అంటారు. ఇక ఆయన వ్యూహాలు కూడా ప్రత్యర్ధులకు షాక్ ఇచ్చేలా ఉంటాయి.

 

జగన్ ప్రజాబలానికి తోడుగా విజయసాయిరెడ్డి  చాణక్యం నిలిచి వైసీపీని అధికారంలోకి తెచ్చిందని అంతా ఒప్పుకుంటారు. అందరికీ ఒక అపురూప సన్నివేశం గుర్తుండే ఉంటుంది. అదేంటి అంటే గత ఏడాది మే 23న వైసీపీకి ఫేవర్ గా ఓ వైపు  ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.  ఆ టైమ్ లో జగన్ నివాసానికి చేరుకున్న విజయసాయిరెడ్డిని గాఢంగా హత్తుకుని జగన్ ఆయనతో కలసి విజయానందం పంచుకున్నరేర్  సీన్  అది. 

 

అంతలా ఆ ఇద్దరు బంధం ఉంది. ఉంటుంది. విజయసాయిరెడ్డి మొత్తం వైఎస్సార్ కుటుంబానికే అభిమాని. అందువల్ల ఆయన్ని జగన్ నుంచి వేరు చేయాలని కుట్ర రాజకీయాలు కానీ మీడియాలో రాతలు కానీ అసలు పనిచేయవు. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. జగన్ విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ని పరామర్శించడానికి వచ్చినపుడు హెలికాప్టర్ నుంచి విజయసాయిరెడ్డిని దించేశారని ప్రచారం జరిగింది కానీ దాని విజయసాయి ఖండించారు. అది లగాయితూ ఇద్దరికీ చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దాన్ని తిప్పికొడుతూనే ఉన్నారు.

 

ఇదిలా ఉండగా ఇపుడు ఏకంగా విజయసాయిరెడ్డి స్వయంగా ఒక దిమ్మతిరిగే జవాబు దీని మీద చెప్పారు. తనకు జగన్ కి మధ్య‌ గొడవలు పెట్టేవారికి ఇదే తన సమాధానం అని కూడా చెప్పారు. తాను జగన్ కి ఎప్పటికీ దూరం కాను అని చెబుతూ ఈ జన్మంతా జగన్ తోనే అని ఒక అమోషనల్ డైలాగ్ వాడారు. అది చాలు కదా ప్రత్యర్ధులకు  బాంబు లాంటి జవాబు అని చెప్పడానికి. ఏది ఏమైనా జగన్, విజయసాయిరెడ్డిల మధ్య మీడియాలో అదే పనిగా వస్తున్న వార్తలకు సాయిరెడ్డి తనదైన తీరులో  గట్టి కౌంటరే ఇచ్చారనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: