గత రెండు నెలలుగా కరోనా వైరస్ దేశాన్ని పట్టిపీడిస్తోంది.  ముఖ్యంగా కరోనా వైరస్ మహారాష్ట్రలో విలయతాండవం చేస్తున్నది. మార్చి నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేస్తున్నప్పటికీ  అత్యధిక కేసులు, మరణాలు రెండు కూడా మహారాష్ట్రలోనే ఉండటం విశేషం.  ఒకవైపు కరోనా వైరస్ ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు వాతవరణం కూడా ఇబ్బందులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నది.  ముంబాయి లాంటి వాణిజ్య నగరంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఆ తర్వాత కరోనా ఎక్కువగా ఢిల్లీ నగరంలో మొదలైంది.  ఇక ఓవైపు లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు.. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం భారత్‌ను కలవరపెడుతోంది.. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు వెళ్తూ వస్తుండడం కూడా కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం అవుతుంది.

 

వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకోవడంతో అప్పటికే కొంత మందికి కరోనా ఉండటంతో ఆ వ్యాధి మరింత మందికి విస్తరిస్తుందని అంటున్నారు.  కరోనా వైరస్ ఎక్కువగా పెరిగిపోవడంతో  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరప్రదేశ్‌ మార్గాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల పాటు సరిహద్దులు మూసివేస్తామని.. నిత్యవసర వాహనాలతో పాటు అనుమతి పాస్‌లు ఉన్నవారు యథావిథిగా ప్రయాణం కొనసాగించవచ్చని చెప్పారు.

 

ఇక, వచ్చేవారం సరిహద్దులను తెరవాలా? వద్దా? అనేదానిపై శుక్రవారం వరకు ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కోరారు సీఎం.. కాగా, ఇప్పటికే ఢిల్లీ-నోయిడా సరిహద్దులను మూసివేస్తున్నట్లు యూపీలోని గౌతమ్‌బుద్ధ నగర్‌ జిల్లా అధికారులు ప్రకటించారు. కరోనా కేసులు తగ్గాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని.. ఇది ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అన్నారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఇతర రాష్ట్రాల ప్రజలను ఢిల్లీకి అనుమతిస్తే.. వారే ఇక్కడ అధికంగా వైద్య సేవలు పొందుతారని, దాంతో.. స్థానికులకు నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు తన దృష్టికి వచ్చాయన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: