తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సరిగ్గా ఇటీవల మహానాడు జరిగిన టైములో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు పాల్గొనకుండా బాబుకి షాక్ ఇవ్వడం అందరికీ తెలిసిందే. గతంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసిపి కి జై కొట్టడం జరిగింది. ఇటీవల మహానాడు జరిగే టైములో పర్చూరు ఎమ్మెల్యే తో పాటు ఏలూరి సాంబశివరావు తో పాటు వైజాగ్ ఎమ్మెల్యే లు కొంతమంది టిడిపి గోడ దూకడానికి రెడీ అయినట్లు మొన్నటిదాకా వార్తలు వినపడ్డాయి. మహానాడు జరిగే టైంలో స్వయంగా చంద్రబాబు వీళ్ళకి ఫోన్ చేసినా గాని ఎటువంటి రెస్పాండ్ రాకపోవడంతో … దాదాపు తెలుగుదేశం పార్టీ నుండి ఏడుగురు ఎమ్మెల్యేలు వైసీపీ లోకి వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.

 

ఈ విషయం నడుస్తూ ఉండగానే తెలుగుదేశం పార్టీలో మరో బిగ్ వికెట్ డౌన్ అవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీలో మంత్రిగా వ్యవహరించిన పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మాజీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ త్వరలో వైసీపీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా రాణించిన ప్రధాని సత్యనారాయణ విభజన జరిగిన తరువాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2017లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా పితాని కి మంత్రి పదవి దక్కటం జరిగింది.

 

కాగా గత సార్వత్రిక ఎన్నికలలో ఆచంట నియోజకవర్గం నుండి పోటీ చేసిన పితాని సత్యనారాయణ ఓడిపోవడం జరిగింది. అయితే సొంత నియోజకవర్గంలో తన సొంత సామాజిక వర్గం శెట్టిబలిజ కి చెందిన వైసీపీ నాయకుడు కౌరు శ్రీనివాసు రాజకీయంగా నియోజకవర్గంలో దూకుడు ప్రదర్శించడంతో తనకు రాజకీయ భవిష్యత్తు పోతుందేమో అని పితాని ఆందోళన చెందుతున్నారట. వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో త్వరలోనే వైసీపీ పార్టీలోకి పితాని రావటానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం. పితాని పార్టీ మారితే కనుక టీడీపీలో పెద్ద వికెట్ పడిపోయినట్లే అని, పశ్చిమ లో టిడిపికి పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: