చంద్రబాబుకు భారీ షాక్...టీడీపీని వీడనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు జగన్‌కు జై కొట్టనున్నారని నాలుగురోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చాయి. మొదట టీడీపీ అనుకూల మీడియాలోనే వారు పార్టీ మారుతున్నట్లు వార్త వచ్చింది. ఇక దీనికి కొనసాగింపుగా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని జగన్ ప్రమాణస్వీకారం చేసిన మే 30 రోజున ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వెళ్లనున్నారని ప్రచారం జరిగింది.

 

అయితే ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఏలూరి, అనగానిలు సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో వీరు పార్టీ జంప్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అనగాని సడన్‌గా వచ్చి పార్టీ మారే ఉద్దేశం లేదని ఒక ప్రకటన ఇచ్చారు గానీ, ఏలూరి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే ఇద్దరు నేతలు మహానాడు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇక ఇదే సమయంలో తమ పార్టీలోకి ఎవరు రావడం లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్ చేశారు.

 

మంత్రి బాలినేని ప్రకటన తర్వాత అసలు కథ మొదలైంది. ఏలూరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తాను పార్టీ మారనని, టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. కాకపోతే రాజకీయంగా పెద్దగా యాక్టివ్‌గా లేనని ప్రకటించారు. ఇక ఏలూరి తర్వాత అనగాని కూడా మీడియా సమావేశం పెట్టి, టీడీపీని వీడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఇలాంటి పుకార్లు మూడోసారని, చంద్రబాబు చేసే ప్రతి పోరాటంలో అండగా ఉంటున్నానని పేర్కొన్నారు. కొందరు కుట్రతో చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సింది పార్టీనేనన్నారు.

 

అయితే ఈ విధంగా పార్టీ మారనని తమ్ముళ్ళు ప్రకటన చేసినా కూడా టీడీపీ కేడర్‌కు నమ్మకం కుదరట్లేదని తెలుస్తోంది.  వాళ్ళిద్దరూ మీడియా సమావేశాలు చూస్తే కాస్త డౌట్‌గానే ఉందని కార్యకర్తలు అంటున్నారు. వైసీపీ ఏదో స్ట్రాటజీ మీద వీరి చేరికలకు బ్రేక్ వేసిందని, ఏదొకరోజు వీళ్ళు జంప్ అయిపోయే అవకాశాలున్నాయని టీడీపీ కేడర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: