ఇటీవల న్యాయస్థానాల పై వ్యాఖ్యలు చేసిన వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు నాయకులకు హైకోర్టు నోటీసులు ఇవ్వటాన్ని వైకాపా ఎమ్మెల్యే అప్పలరాజు తప్పుబట్టారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ కోర్ట్ పై వ్యాఖ్యలు చేసినందుకు వైసిపి ప్రజాప్రతినిధులకు అదేవిధంగా సోషల్ మీడియాలో నెటిజన్లకు నోటీసులు ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశం అనంతరం ఒకవేళ నాకు కూడా నోటీసులు ఇస్తారేమో అని సందేహం వ్యక్తం చేశారు. 2008వ సంవత్సరంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాల లో న్యాయమూర్తుల జోక్యం ఉండకూడదు అని మందలించింది. ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేస్తుంటే ఆ మేనిఫెస్టో అమలు కాకుండా ప్రత్యర్థులు కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం నిజంగా బాధాకరం అని  అంటున్నారు.

IHG

అలా అయితే మేనిఫెస్టో అడ్డుకున్నందుకు రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తే వాళ్లకి కూడా నోటీసులు ఇస్తారా అని వైకాపా ఎమ్మెల్యే లాజిక్ ప్రశ్నలు వేశారు. ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసేందుకు ముందుకు వెళుతుంటే ప్రత్యర్థులు, కోర్ట్ లు అడ్డుకోవడం ఏంటి ? అసలు కోర్టుల పరిధి ఏమిటి ? పరిపాలనలో న్యాయస్థానం జోక్యం ఏంటి ? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక డాక్టర్ అయ్యుండి పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తుంటే, నడిరోడ్డు పై తాగి వైద్యుడి లాగ ప్రవర్తించకుండా ఉంటే అతన్ని మందలిస్తే  డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకోవడం చాలా అమానుషమని అన్నారు.

IHG

ఒకరికి ఒకలాగ మరొకరికి మరొక లాగా వ్యవస్థలు పనిచేస్తున్నాయని సీరియస్ అయ్యారు. లాక్‌డౌన్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు నిత్యావసర సరుకులు అందజేస్తే సీబీఐ విచారణకు ఆదేశిస్తామన్నారు. మరి చంద్రబాబు లోకేష్ జాతరలాగా రాష్ట్రం లోకి వస్తే దాన్ని ఎందుకు సుమోటోగా స్వీకరించడం లేదు. ఇంకా అనేక విషయాల గురించి ఎమ్మెల్యే అప్పలరాజు న్యాయస్థానం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: