భారతదేశం ఒకప్పుడు ఆయుధాలు కావాలన్నా వాహనాలు కావాలన్న  ఇతర దేశాలపై  ఎక్కువగా ఆధారపడి ఉండేది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రష్యా పై వివిధ యుద్ధ ఆయుధాల కోసం ఎన్నో ఏళ్ల పాటు ఆధారపడుతూ వచ్చింది భారత దేశం. ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మాత్రం పూర్తిగా మార్చివేశారు. తరతరాల నుంచి వస్తున్న వాటిని  కూడా పూర్తిగా మార్చివేశారు నరేంద్ర మోడీ. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం తక్కువ మెజారిటీ ఉంటుంది కాబట్టి ఏదైనా నిర్ణయం  తీసుకునేందుకు ఆలోచిస్తూ ఉండేది కానీ ప్రస్తుతం బిజెపి పార్టీకి అత్యధిక మెజారిటీ ఉంది కాబట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతుంది. ఇక అలిన విదేశాంగ విధానాన్ని గతంలోనే వాజ్పాయ్  కొట్టిపారేసిన విషయం తెలిసిందే. 

 

 

 ఇక ఇప్పుడు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మేకిన్ ఇండియా అనే నినాదం ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. మన ఆయుధాలను తయారు చేయడం... వాహనాలను తయారు చేయడం వాటిని ఇతర దేశాలకు అమ్మడం లాంటివి కూడా చేస్తున్నారు. ఓవైపు విదేశాల నుంచి కొన్ని ఆయుధాలను కొంటునే  మన దగ్గర తయారైన వాహనాలను కూడా విదేశాలకు అమ్మడం జరుగుతుంది ప్రస్తుతం రోజుల్లో . దీని వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఎంతో  అభివృద్ధి చెందడంతో పాటు దేశ అభివృద్ధికి తోడ్పడ్డాయి. 

 

 

 ఇక నిన్న మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ అయిన ఆనంద్ మహేంద్ర దీనికి సంబంధించి ఏకంగా ప్రాక్టికల్ గా చూపించారు. ఇటీవలే మహీంద్రా లో తయారైన తేలిక పాటి సాయుధ  వాహనం ఐఎస్ఎల్వి ని  సైన్యం పరీక్షిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మహేంద్ర అండ్ మహేంద్ర తయారు చేసిన ఈ మిషన్ ఎటువంటి భూభాగాల పైన అయినా సరే ప్రయాణించేందుకు వీలుగా తయారు చేసినట్లు తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా నిరంతరాయంగా పెట్రోలింగ్  నిర్వహించడానికి ప్రత్యేక దళాలకు  ఉపయోగపడుతుంది. బుల్లెట్ దాడిని అడ్డుకోవడంతో పాటు అవసరమైన ఆయుధాలను భద్రపరచుకునేందుకు ... 400 కేజీల సరుకులు కూడా తరలించేందుకు వీలుగా ఉంటుంది ఈ వాహణం . ఇలా మేకిన్ ఇండియా లో భాగంగా ఏకంగా దేశంలోనే ఆటోమొబైల్ సంస్థల్లో ముఖ్యమైనటువంటి మహేంద్ర దీనికి ముందుకు రావడం నిజంగా హర్షనీయం అంటున్నారు విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: