జగన్ ఏపీకి చెందిన ముఖ్యమంత్రి. పైగా ప్రత్యర్ధి పార్టీ మనిషి ఆయన పార్టీ వైసీపీ. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. ఇక్కడ చూస్తే బీజేపీ జగన్ కి పూర్తి యాంటీగా పనిచేస్తోంది. కానీ వరస చూస్తూంటే కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని వైసీపీ మిత్ర పక్షాలుగా ఉంటున్నాయి.

 

అంతే కాదు, ఒకే పార్టీ అన్నంతగా ఉంటున్నారు. నిజానికి ఈ సన్నివేశం బీజేపీతో పొత్తు పెట్టుకుని 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశానికి కూడా లేదు. ఆనాడు అక్కడ ఇగోలు బాగా వర్కౌట్ అయ్యాయని అంటారు అందుకే ఇద్దరూ కూడ  మనసు విప్పి మాట్లాడుకోలేకపోయారు. ఓ విధంగా బాబు మోడీ కంటే సీనియర్. దాంతో ఆయన కొంత ఇబ్బంది పడాల్సివచ్చింది.

 

ఇక జగన్ విషయం చూసుకుంటే ఆయన తొలిసారి సీఎం కావడంతో పాటు ఎక్కడా తగ్గాలో, మరెక్కడ నెగ్గాలో బాగా తెలుసుకున్నారు. ఈ కారణంగానే కేంద్రంతో సంబంధాలు గతం కంటే కూడా బాగున్నాయి అంటున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ నేత, ఏపీకి చెందిన రాం మాధవే చెప్పారు. జగన్ ఏపీలో బగా పాలన చేస్తున్నారని కూడా కితాబు ఇచ్చారు.

 

రెండు ప్రభుత్వాలు కలసి ప్రజల కోసం కలసికట్టిగా అన్నీ చేస్తున్నాయని రాం మాధవ్ అనడం విశేషం. ఇక జాతీయ నాయకత్వం ఇలా జగన్ పాలనను మెచ్చుకుంటూంటే ఏపీ బీజేపీ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. ఏవరేమనుకున్నా లోక్ సభలో నాలుగవ అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీకి రాజ్యసభలో కూడా ఆరుగురు ఎంపీలు రాబోతున్నారు. దాంతో రాజ్యసభలో వైసీపీ బలం కూడా బీజేపీకి అవసరం. ఇక ఏపీకి అన్ని విధాలుగా కేంద్ర సాయం అవసరం. 

 

ఇల పరస్పర అవసరాలను తీర్చుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి రిలేషన్లు మెయింటేయ్ చేస్తున్నాయని అంటున్నారు. ఇలా ఘర్షణలు లేకుండా పనిచేయడం మంచి పరిణామేనని అంటున్నారు. అందుకే జగన్ కూడా ఢిల్లీ టూర్లలో కేంద్ర పెద్దలను కలుసుకుని సమస్యల పరిష్కారం పట్ల అత్యంత శ్రధ్ధ కనబరుస్తున్నారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: