కరోనా  వైరస్ క్లిష్టపరిస్థితుల్లో దేశ ప్రజానీకం మొత్తం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. సంపన్నుల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.... వలస కూలీలు సామాన్యుల పరిస్థితి మాత్రం రోజురోజుకూ దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా లాక్ డౌన్  అమలైన రోజుల్లో ఎలాంటి ఉపాధి లేకపోవడంతో కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. ఇక ఆ తర్వాత లాక్ డౌన్ సడలింపు ఇస్తున్న క్రమంలో.. వలస కార్మికుల ను స్వస్థలాలకు పంపించినందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో హృదయవిదారక దృశ్యాలు ఎన్నో  కనిపించాయి విషయం తెలిసిందే. చాలామంది వలస కార్మికులు వందల కిలోమీటర్లు నడిచి వెళ్లిన దృశ్యాలు కూడా మనం చూశాం. అంతేకాకుండా ఎంతోమంది వలస కార్మికులు ప్రాణాలు సైతం కోల్పోయారు. 

 


 అయితే వలస కార్మికుల కష్టాలు పడుతున్న నేపథ్యంలో ఎంతో మంది ముందుకు వచ్చి వలస కార్మికులకు సహాయం చేయడానికి చేయూత ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విలన్లు హీరోలుగా  మారిపోయారు. సినిమాల్లో ఎన్నో నెగిటివ్ పాత్రలో నటించి విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్  సోను సూద్ వలస కార్మికులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందున్నారు. ముఖ్యంగా సోను సూద్ తాను వలస కార్మికులకు సహాయం చేయడానికి గల కారణం చెప్పగా.. ఎంతో  మంది హృదయాలకు తాకిన విషయం తెలిసిందే.తాను  కూడా ఒకప్పుడు వలస కార్మికుడీనె అని  ఇలా రైలులో  తిరుగుతూ ఎన్నో పనులు చేసుకుంటూ జీవించాను. ప్రస్తుతం  వలస కార్మికుల కష్టాలను చూస్తే తన హృదయం ద్రవించి పోయింది అంటూ చెప్పుకొచ్చారు సోను సూద్

 


 ఇక వలస కార్మికులకు చేయూతనిచ్చేందుకు వారి కష్టాలను పోగొట్టేందుకు సోనుసూద్ చేసిన సాయం గురించి మాటల్లో చెబితే తక్కువేనేమో. ఏకంగా వలస కార్మికులకు బస్సు సౌకర్యాలు కల్పించి ఆహారం ఏర్పాటు చేశారు సోను సూద్. కేవలం బస్సులో మాత్రమే కాదు ఏకంగా విమానం కూడా ఏర్పాటు చేసి వలస కార్మికులు తరలించేందుకు ముందుకు వచ్చారు. అదే సమయంలో ప్రకాష్ రాజ్ కూడా తన మంచి మనసు చాటుకున్నారు. తన దగ్గర లేకున్నప్పటికీ అప్పులు చేసి మరి వలస కార్మికులకు సహాయం  చేశారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం కరోనా  కష్టకాలంలో ఈ ఇద్దరు విలన్లు హీరోలుగా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: