లాక్ డౌన్ దెబ్బకి రెండు నెలలుగా షూటింగులు మరియు సినిమా థియేటర్ లు క్లోజ్ అయిపోయాయి. ఎప్పటికీ మళ్లీ థియేటర్లు  ఓపెన్ అవుతాయో అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఒకవేళ థియేటర్ లు ఓపెన్ చేసినా కానీ ప్రేక్షకులు ఇదివరకు లాగా సినిమా చూసే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి సమయంలో సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వాల్సిన సినిమా నిర్మాతలకు ‘ఓవర్ ది టాప్’ (ఓటీటీ) ప్లాట్ ఫాం ఆపద్బాంధవుడిగా మారాయి. ఇదే టైం లో OTT ప్లాట్ ఫార్మ్స్ వేదికలు నేరుగా సినిమాలు రిలీజ్ చేయమని చిన్న మరియు మధ్య తరహా ప్రొడ్యూసర్లకు గాలం వేస్తున్నాయి. అయినా కానీ చోటామోటా నిర్మాతలు OTT ప్లాట్ ఫార్మ్స్ చెప్పే ఆఫర్ లు వింటున్నా గానీ పెద్దగా ఎట్రాక్ట్ అవటం లేదు.

 

ఎందుకంటే OTT ద్వారా రిలీజ్ చేయడం వల్ల పెద్దగా లాభాలు ఏమి ఉండవు. దీంతో చాలా వరకు ఇండస్ట్రీలో బడా బడా నిర్మాతలంతా సినిమా థియేటర్ లు ఓపెన్ చేసిన తర్వాతే… సినిమాలు రిలీజ్ చేయాలని ప్రేక్షకులకు ఏ మాత్రం ఇలాంటి పద్ధతి అలవాటు చేయకూడదని డిసైడ్ అవుతున్నారట. అంతేకాకుండా ఇప్పటి వరకు OTT ప్లాట్ ఫార్మ్స్ ద్వారా విడుదలైన ‘పొన్మగల్ వందాళ్’, ‘అమృతారామమ్’ మరియు నవదీప్ నటించిన ‘రన్’ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.

 

ఓటీటీ వేదికలపై రిలీజ్ అవుతున్న ఏ ఒక్క సినిమా కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ సాధించకపోవడంతో చాలా మంది నిర్మాతలు ఓటీటీ సంస్థలు అందిస్తున్న ఆఫర్లకు ససేమిరా అంటున్నారట. దీంతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అధినేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క సినిమా నిర్మాతలు థియేటర్ యాజమాన్యాలతో మంతనాలు జరుపుతున్నారట. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇస్తే ఏ విధంగా థియేటర్ లు రన్ చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: