గత రెండు మూడు రోజులుగా నందమూరి నట వారసుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లోనూ,  తెలంగాణ, ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని కొంత మంది సినీ ప్రముఖుల బృందం కరోనా చారిటీ క్రైసిస్ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కళాకారులను ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఇటీవల సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో  చిరంజీవి బృందం చర్చించింది. అయితే ఈ సమావేశానికి తనను పిలవకపోవడంతో ఆగ్రహం చెందిన బాలకృష్ణ మంత్రితో కలిసి  హైదరాబాదులోని భూములును పంచుకునేందుకు వారంతా కలిశారు అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు.

 

IHG


 ఇక అక్కడి నుంచి వార్ స్టార్ట్ అయ్యి బాలయ్య వర్గం, మెగాస్టార్ వర్గం దీనిపై విమర్శలు చేసుకోవడంతో రెండు రోజులుగా ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇది ఇలా ఉంటే, ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య ఈ విషయంపై స్పందించారు. సీఎం కేసీఆర్ ను కలవడానికి వాళ్ళంతా వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు పిలవలేదో నాకు తెలియదు అని, గతంలో నేను ఒక రాజకీయ నాయకుడిగా కేసీఆర్ పై చేసిన విమర్శలు కారణంగానే నన్ను పిలవకూడదు అని అనుకుంటే, ఆ విషయం నాకు చెప్పాలి. నా మీద ఎప్పుడూ కేసీఆర్ కు కోపం లేదు. రాజకీయం వేరు, నామా నాగేశ్వరరావు ఎన్నో తిట్లు కేసీఆర్ ను తిట్టారు.


అయినా చివరకు ఆయన టిఆర్ఎస్ లో చేరారు. రామారావు గారి అభిమానిగా నేనంటే కేసీఆర్ గారికి పుత్ర వాత్సల్యం ఉందని, అటువంటిది నా మీద ఎందుకు కోపం ఉంటుంది అని బాలయ్య  వ్యాఖ్యానించారు. మొత్తంగా కేసీఆర్ కు నా మీద ఎటువంటి కోపం లేదు అంటూ బాలయ్యే స్వయంగా ప్రకటించుకోవడమే కాకుండా, ఈ విషయంలో కేసీఆర్ ఆగ్రహం ప్రదర్శించక ముందే ఈ విధంగా వ్యాఖ్యానించడం ఆయనలో ఉన్న లౌక్యాన్ని తెలియజేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: