అబ్బాబ్బా...! పగవాడికి కూడా ఈ కష్టాలు కాకూడదు. ఏడు పదుల వయసులో హాయిగా కృష్ణ.. రామా అనుకోకుండా, కరోనాను లెక్క చేయకుండా, తనకు ఉన్న అనారోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గట్టిగానే కష్టపడుతున్నారు. చెప్పుకోవడానికి రాజకీయ వారసుడు ఉన్నా, అతగాడి వలన కలిగే ప్రయోజనం ఎంత ఉంటుందో చంద్రబాబు కు బాగా తెలుసు. అందుకే వయస్సు భారమైన, అనారోగ్య  సమస్యలు వెంటాడుతున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకోసం కష్ట పడుతున్నారు. ఈ కష్టాలు చాలవన్నట్లు ఇప్పుడు టీడీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నియోజకవర్గస్థాయి నాయకులు, అధికార పార్టీ వైసీపీ కి మద్దతుగా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తుండడం కూడా చంద్రబాబుకు మింగుడుపడడం లేదు.

IHG


 గత టీడీపీ ప్రభుత్వంలో అడ్డూ అదుపు లేకుండా, అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలిన నాయకులను చంద్రబాబు అడ్డుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ అవినీతి వ్యవహారాలను ఏపీ ప్రభుత్వం తవ్వి తీస్తుందన్న భయంతో టిడిపి నాయకులు పెద్ద ఎత్తున వలస బాట పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. నాయకుల వలసలపై చంద్రబాబుకు టెన్షన్ రోజు రోజుకి పెరిగిపోతోంది. వారికి పార్టీ తరుపున ఎంతగా భరోసా ఇద్దామని ప్రయత్నిస్తున్నా, నాయకుల్లో నమ్మకం కుదరకపోవడం వంటి పరిణామాలు చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తున్నాయని, దీనికితోడు ముగ్గురు ,నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే కనుక, ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా తనకు ఉండదనే భయం లో చంద్రబాబు ఉన్నారు. 

 

IHG

 

అందుకే పార్టీ నాయకులూ, ఎమ్యెల్యేలు ఎవరూ దూరం కాకుండా వారితో నిత్యం సంప్రదింపులు చేస్తూ, పార్టీ నాయకులు చేజారి పోకుండా చూసుకునే బాధ్యత లను పార్టీ కీలక నాయకులు కొందరికి అప్పగించినట్టు తెలుస్తోంది. అలాగే మహానాడుకు డుమ్మా కొట్టిన కీలక నాయకుల కదలికపైన, పార్టీ నాయకులతో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా చంద్రబాబుకు పార్టీలో క్రమక్రమంగా హావా తగ్గుతోంది. అలాగే లోకేష్ టిడిపి రాజకీయ వారసుడిగా ప్రకటించే నిర్ణయాన్ని మెజారిటీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే, పార్టీ భవిష్యత్తు పై ఆందోళన నాయకుల్లో పెరిగిపోతున్నట్టు  కనిపిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే వారు తమ రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి డోకా లేకుండా చూసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: