మనం బాగా గమనించినట్లయితే దేశంలో కేసులు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ చాలా కఠినంగా అమలు చేసి ఇప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటినా కూడా సడలింపులు ఇచ్చేసి అన్ని వ్యాపార సంస్థలు మరియు షాపులను తెరుచుకోమని పర్మిషన్ ఇచ్చేసింది. దీని పై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తూ ఉండగా అసలు భారత్ లాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.

 

నిజాలు మాట్లాడుకుంటే దశలవారీగా నెలల తరబడి అతి క్లిష్టమైన లాక్ డౌన్ విధించినా.... కరోనా కట్టడి విషయంలో ఎటువంటి మార్పు లేదు. రోజుకి కొత్త రికార్డులు బద్దలు అవుతున్నాయే తప్ప ఒక్క చోట కూడా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వం వివేకంతో ఆలోచించి వ్యూహాత్మకంగా లాక్ డౌన్ నుండి కొన్ని కీలకమైన మినహాయింపులు ఇవ్వడం మొదలుపెట్టింది. దీనివల్ల అసలు కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు లాక్ డౌన్ అన్న పదం ఉందా లేదా అన్నట్లు ప్రజల ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే దేశంలో అన్ లాక్ ప్రక్రియ ఎప్పుడో మొదలయింది.

 

విషయం ఏమిటంటే కరోనాను లాక్ డౌన్ వల్ల తరిమికొట్టడం అసాధ్యమని కొద్దిరోజులకే అర్థం అయిపోయింది. ఇక లాక్ డౌన్ పేరుతో వ్యాపార కార్యకలాపాలను స్తంభింపచేసి.... ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే బదులు అందుకు ప్రత్యామ్నాయం 'హెర్డ్ ఇమ్యూనిటీ' అనే ఒక మార్గం ఉందని కేంద్రం తెలుసుకున్నారు

 

దీంతో కరోనా సోకకుండా ప్రజలను ఏమాత్రం కట్టడి చేయలేని అర్థమైన ప్రభుత్వం కరోనా వచ్చినా తట్టుకునే సామర్థ్యాన్ని ప్రజల్లో పెంచడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సామూహికంగా రోగనిరోధకశక్తి పెంచితే కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది అని.... ఇప్పటికే బ్రిటన్, స్వీడన్ వంటి దేశాలు విషయంలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు కూడా రుజువులు ఉన్నాయి.

 

అందుకే సడలింపుల్లో కూడా ముసలి వారు మరియు చిన్న పిల్లలు బయటకు రాకూడదని..నిబంధనలు విధించారు. యువతకు.. కరోనాను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. అందుకే.. కరోనా సోకినట్లుగా బయటపడిన వారిలో … 70, 80 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదు. చాలా మందికి.. కరోనా సోకి తగ్గిపోయి ఉంటుందనే అంచాలు ఉన్నాయి. ఇలా భారత్ తలపెట్టిన రివర్స్ వ్యూహం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: