ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోన్ మోహన్ రెడ్డి కి హైకోర్టు షాక్ ఇచ్చింది అని అంతా అంటున్న తరుణంలో వైసీపీ అధ్యక్షుడు ఈ విషయాన్ని సుప్రీం కోర్టు వరకూ తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయి చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ మధ్యలో జగన్ ప్రభుత్వం…. హైకోర్టు వారు తమ ప్రభుత్వం తమకు ఉన్న పవర్ లోనే ఒక ఆర్డినెన్స్ను జారీ చేయగా దానిని కొట్టివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేయడం గమనార్హం.

 

IHG's order on new bar ...

 

విషయం ఏమిటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను జగన్ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో కారణంగా ఉన్నఫలంగా రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవి నుండి తొలగించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు.... ప్రభుత్వం మళ్ళీ తిరిగి రమేష్ కుమార్ ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమై.... అందుకు అవసరమైన సన్నాహాలను ఇప్పటి నుండే మొదలు పెట్టింది.

 

IHG

 

అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే.... హైకోర్టు నేరుగా రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మళ్లీ అతనికి ఆ పదవిని ఇవ్వవలసి ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రక్రియను ఎలక్షన్ కార్యదర్శి జరిపించవలసిన ఉండగా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా తన పవర్ తో నిలిపివేసింది.

 

IHG

 

దీంతో ఇప్పటికే నిమ్మగడ్డ తాను మళ్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పగ్గాలు చేపడుతున్న ప్రకటించుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అతనికి ఎటువంటి పదవి ఇవ్వకపోవడంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం తాము సుప్రీంకోర్టులో.... హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఛాలెంజ్ చేస్తూ ఉండడంతో ఎవరూ వారిని తప్పుబట్టలేని పరిస్థితి. కానీ నిమ్మగడ్డ మాత్రం నేనే మళ్లీ ఎలక్షన్ కమిషన్ అంటూ తొందరపాటుతో ప్రకటన చేసుకొని ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచక ఊరుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: