ప్రపంచదేశాల మధ్య అంతర్గతంగా యుద్దానికి తెరతీసే ఘటనలు జరుగుతున్నాయట.. ఎవరికి వారే తమ దేశ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం చైనాను చూస్తే అర్ధం అవుతుంది.. ఇప్పటికే కరోనా వల్ల ప్రపంచానికి భారీ నష్టం జరగగా, కరోనాకు పుట్టిల్లైనా చైనా పై అమెరికా తీవ్రస్దాయిలో మండిపడుతుంది.. అంతే కాకుండా చైనా చేసిన తప్పులను వెతికిపట్టుకుని దాన్ని దోషిగా నిరూపించి ఏకాకిగా మార్చాలనే యత్నాలు జరుగుతున్నాయి..

 

 

ఇప్పటికే చైనా వేసిన కరోనా ఎత్తుగడలో అమెరికా తీవ్రస్దాయిలో నష్టపోతుందన్న విషయం తెలిసిందే.. అయితే మన భారతదేశం ఒక పాకిస్దాన్‌తో తప్పితే దాదాపుగా మిగతా అన్ని దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంది.. ఈ దశలో ఇండియా పరిస్దితి అడ కత్తెరలో పోక చెక్కలా మారుతుందని తెలుస్తుంది.. అదెలా అంటే.. అమెరికాకు డ్రాగన్‌కు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధంలో వేలు పెట్టడం భారత్‌కు అంత మంచిది కాదంటూ చైనా హెచ్చరించిందట. అంతే కాకుండా ఆ దేశం తరపున ఏమైనా చర్యలకు దిగినా, అమెరికాకు వత్తాసు పలికినా..అది భారత్‌-చైనాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఒక కథనాన్ని ప్రచురించిందట.

 

 

ఇంతటితో ఆగకుండా భారత్‌తో ఏమాత్రం ముప్పు ఉందని భావించినా.. వెంటనే దాడి చేసేవిధంగా చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తమ సైన్యాన్ని బలోపేతం చేసుకుంటున్నారని వెల్లడించారు మరో వైపు భారత్‌-చైనా సరిహద్దుల్లోని వ్యూహాత్మక పరిస్థితుల్ని తమకు అనుకూలంగా చైనా మలచుకుంటూనే తమపై బెదిరింపులకు పాల్పడుతోందని అమెరికా సెక్రటరీ మైక్‌ పాంపియో ఆరోపించారు..

 

 

ఏది ఏమైనా చైనా చేసే కుట్రలు భారత్‌ను ప్రమాదంలోకి నెట్టుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.. చైనా ఒంటరిగా మారడమే కాకుండా అనవసరంగా భారత్‌ను అమెరికా గొడవలోకి లాగుతుంది.. తప్పు ఎవరు చేసిన ప్రశ్నించే హక్కు ప్రతి దేశానికి ఉంది.. ఈ పరిస్దితుల్లో డ్రాగన్ చేసిన, చేస్తున్న తప్పులను సమర్ధించిన, సమర్ధించక పోయినా ప్రమాదమే.. ఈ పరిస్దితులు ఇలాగే కొనసాగితే మాత్రం ఏ క్షణం యుద్ధ వాతావరణం నెలకొంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: