మానవుడు ఎంత అభివృద్ధిని సాధిస్తున్న, ఊహించనంత మేధస్సును సొంతం చేసుకుంటున్న ప్రకృతి ముందు ఓడిపోతూనే ఉన్నాడు.. అయినా తన పరుగును ఆపడం లేదు.. ఒక్కోసారి తాను చేసే అభివృద్ధి అనే ప్రయాణంలో విపత్కర పరిస్దితులను ఎదుర్కొంటూ జయానికి అపజయానికి మధ్య ఊగిసలాడుతున్నాడు.. ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలియచేస్తూ, మరణాన్ని జయించడానికి కృషి చేస్తున్నాడని అనుకుంటున్నాడు గానీ ఇప్పటికి ప్రపంచాన్ని వణికిస్తున్న కొన్ని వైరస్‌లకు వైద్యాన్ని కనుగొనలేక పోయాడన్న విషయాన్ని విస్మరించాడు..

 

 

అలాంటి వాటిలో ప్రస్తుతం కరోనా చేరింది.. దీనికి వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని కరోనా వచ్చినప్పటి నుండి చెబుతూనే ఉన్నారు.. ఇలాగే ఇంకా కొన్ని రోజులు గడిచిపోతే జనం అన్నీ మరచిపోతారు.. వైరస్ వచ్చిన కొత్తలోనే హడావుడి, ఆ తర్వాత దానికి అలవాటుపడ్డాక ఎలాంటి ఆర్భాటం ఉండదు.. ఇకపోతే కరోనా వైరస్ విపత్తుతో ప్రపంచం అల్లాడుతుంటే, మరో వైపు కాంగో దేశంలో ఎబోలా వైరస్ వ్యాపిస్తుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.. నిజానికి కరోనా వైరస్ తో అల్లాడుతున్న సమయంలో ఎబోలా వైరస్ ప్రబలుతుండటం దురదృష్టకరం..

 

 

ఇక కాంగోలో 1976లో మొదటి సారి ఎబోలా వైరస్‌ను గుర్తించిన తర్వాత ఇప్పటికి 11సార్లు అక్కడ ఈ వ్యాధి విజృంభించింది. ఇది నిజంగా పరీక్షా సమయం అనీ డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.. అయితే ప్రస్తుతం కాంగో దేశంలోని ఈక్వెటర్ ప్రావిన్సు పరిధిలోని వంగట హెల్త్ జోన్ లో ప్రబలిన ఎబోలా వైరస్ వల్ల ఆరుగురు ఆసుపత్రిలో చేరగా, వారిలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని కాంగో ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

 

 

కాంగో దేశంలో ఎబోలా వైరస్ సోకిందనే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధ్రువీకరించింది.. అసలు ఈ సంవత్సరం ప్రజలతో 20 20 మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉంది.. ఎక్కడ చూడు విపత్తులే ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: