ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా వైరస్ తో విల విలలాడిపోతుంది.. మార్చి 24 నుంచి లాక్ డౌన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ఓ వైపు చేసుకోవడానికి పనులు లేకా బయటకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో విశాఖలో ఘోరం జరిగింది. ఎల్జీ పాలిమర్స్ విష వాయువు వెలువడి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది. అప్పుడు అక్కడి భీతావాహ పరిస్థితి చూస్తే ఎవరైనా అయ్యో అనాల్సింది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్  దుర్ఘటన ఇంకా మదినుంచి చెరిగిపోవడంలేదు. ఈ గ్యాస్ కు మరో ప్రాణం బలయింది.

 

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. గతంలో 12 మంది మరణించగా, కొద్దిరోజుల ఒక వృద్ధ మహిళల మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా స్టైరిన్ గ్యాస్ ప్రభావంతో యలమంచలి కనకరాజు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు రోజులు చికిత్స పొందిన కనకరాజు ఆరోగ్యం బాగానే ఉండటంతో ఇంటికి వెళ్లిపోయాడు. కిత్స తర్వాత కోలుకొని ఇంటికి చేరుకున్నా ప్రాణాల మీద నమ్మకం లేకుండా పోయింది. వరుసగా మరణాలు సభవిస్తూనే ఉన్నాయి. ఆయాసం, కడుపు ఉబ్బరంతో శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా మారింది.

 

దీంతో నిన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. కార్పెంటర్‌గా పనిచేసే కనకరాజు ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. అంతా బాగుందనుకునే లోపు ప్రాణాలు కోల్పోయాడు.  అతడి మరణానికి స్టైరీన్ విష వాయువే కారణమని స్థానికులు చెబుతున్నారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  చికిత్స అనంతం ఒక్కొక్కరిగా మృతి చెందుతుండటంతో  వెంకటాపురం  గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: