తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర పరిపాలన ప్రజలకు అతి చేరువలో కావాలనే ఉద్దేశంతో పది జిల్లాల తెలంగాణ కాస్త 33 జిల్లాలకు పెంచేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు ద్వారా జిల్లాలోని కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామపంచాయతీలు ఇలా అనేక మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త చరిత్రకు నాంది తీసింది. ఆ సమయంలో అన్ని జిల్లాలు అవసరమా అన్న వారు కూడా ఇప్పుడు ప్రజల చెంతన పాలన బాగుందని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

IHG

 

2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016 అక్టోబర్ వరకు 11 జిల్లాలు ఉండేవి. అయితే ఆ తర్వాత కొత్తగా మరో 23 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ మొత్తం జిల్లాల సంఖ్య 33 గా పెంచేసింది. ఇక ఇందులో ఒక్కో జిల్లాలో సగటున 35 లక్షల జనాభా ఉండేవిధంగా చూసుకుంటూ జిల్లాల విభజన చేసింది. నిజానికి కేవలం 10 జిల్లాలు ఉండడమే ద్వారా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవడం గమనించడం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక 1974 చట్టం ప్రకారం తొలుత పది జిల్లాలకు కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం 33 జిల్లాలను తెలంగాణలో ఏర్పాటు చేయబడింది.

 

ఇలా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను సత్వరంగా, త్వరగా పరిష్కరించాలని నేపథ్యంలో ముప్పై మూడు జిల్లాలను ఏర్పరిచి వాటికి సంబంధించి ప్రతి పనిలో ఎక్కడ లోటులేకుండా పరిపాలన సులువు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుండగా రోజు రోజుకి రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. ఒకానొక దశలో అసలు ఇన్ని జిల్లాలో అవసరం అన్నవారికి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: