దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ పంజా విసురుతోంది. దీంతో రోజురోజుకు భారీగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దాదాపు భారతదేశంలో రెండు లక్షలకు చేరువలో  ఉన్నాయి కరోనా  వైరస్ కేసులు సంఖ్య. కొన్ని రాష్ట్రాల్లో అయితే రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. అయితే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ ఫలితం మాత్రం కనిపించడం లేదు. కొన్ని రాష్ట్రాలలో ప్రజలు నిర్లక్ష్యం ప్రభుత్వ అసమర్థత ఏకంగా దేశానికి శాపం గా మారిపోతుంది. కొన్ని రాష్ట్రాలలో ఈ మహమ్మారి వైరస్ చాలా కంట్రోల్ లోనే ఉన్నప్పటికీ మహారాష్ట్ర తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అయితే రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 

 


 ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. అదే సమయంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పేషెంట్ లకు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు కూడా తగిన వసతులు కూడా లేకపోవడంతో ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి మరింతగా పెరుగుతుంది. అయితే ఢిల్లీ రాష్ట్రం కూడా ప్రస్తుతం కరోనా  వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ సర్కార్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ... కరోనా వైరస్ కట్టడికి సరికొత్తగా చర్యలు చేపడుతూనే ఉంది. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది  కేజ్రీవాల్ సర్కార్. 

 

 

 తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ఒక యాప్ ని లాంచ్ చేయాలని నిర్ణయించారు. ఈ యాప్  ద్వారా కరోనా వైరస్ కు సంబంధించి ఏ హాస్పిటల్ లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి... అంతేకాకుండా ఎంత మొత్తంలో వెంటిలేటర్ లు అందుబాటులో ఉన్నాయి అనే విషయాన్ని స్పష్టంగా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. కరోనా  వైరస్ కట్టడి లో భాగంగా అటు వైద్యులు ఇటు సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రభుత్వం ఈ యాప్ లాంచ్  చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో... ఏ ఆస్పత్రిలో ఎంత మొత్తంలో కరోనా  వైరస్ పేషెంట్ ను చేర్చుకోవడానికి అవకాశం ఉంది అన్నది మాత్రం ఈ యాప్ లో స్పష్టంగా తెలుస్తుంది అంటూ కేజ్రీవాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: