2019  ఎన్నికల దెబ్బకి తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తిగా పడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీగా రాణించింది టీడీపీ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో మొదటిలో రాణించిన తరువాత చంద్రబాబు ఏపీకి పరిమితం కావడంతో టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ తర్వాత జరిగిన ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవడం తో  గడ్డుకాలం ఎదుర్కొంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ పార్టీకి మళ్లీ పునర్ వైభవం రావాలంటే పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలని సీనియర్ కార్యకర్తలు, కొంతమంది నాయకులు బలంగా కోరుకుంటున్నారు.

 

ఎప్పటినుండో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ లోకి తీసుకురావాలని వార్తలు వస్తున్నా ఎన్నికల టైంలో బాలయ్యబాబు పెద్ద అల్లుడు ఎన్టీఆర్ రాకని విభేదించడం అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ రాక అవసరం లేదు అని పార్టీలో చాలా మంది పని చేసే నాయకులు ఉన్నారని అప్పట్లో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే టైమ్ లో ఎన్టీఆర్ వస్తే పార్టీలో నారా లోకేష్ కి ప్రాధాన్యత తగ్గే అవకాశముంది అనే వాదన ఉండటంతో చంద్రబాబు మద్దతుదారులు ఎన్టీఆర్ రాక ని ఎప్పటి నుండో వ్యతిరేకిస్తున్నట్లు మనం వార్తలు వింటున్నాం. ఇదిలా ఉండగా ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఉన్న కొద్ది కనుమరుగయ్యే టట్లు  డౌన్ ఫాల్ అవుతున్న తరుణంలో బాలయ్య బాబు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి యాంకర్ ప్రశ్నించగా.. దానికి బాలయ్య జవాబిస్తూ” తారక్ కు సినిమా భవిష్యత్తు చాలా ఉంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం. నాన్నగారు కూడా ఒకపక్క ముఖ్యమంత్రిగా ఉంటూనే మరోపక్క సినిమాలు చేశారు. నేను కూడా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాలు వదిలేసి పాలిటిక్స్ లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం.” అని అన్నారు. బాలయ్య మాటలు బట్టి చూస్తే ఒకపక్క సినిమాలు చేయాలనే అంటున్న రాజకీయాలు కూడా చేయవచ్చని ఇండైరెక్టుగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అంటున్నట్లు అందరికీ అర్థమవుతోంది. మొత్తనికి తారక్ రానిదే తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం రాదని అర్థమవుతోంది. మొన్నటి వరకు ఎన్టీఆర్ రాకను విభేదించిన వారే మెల్ల మెల్లగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి పాజిటివ్ గా మాట్లాడటం బట్టిచూస్తే టీడీపీ గ్రాఫ్ తగ్గిందని బాలయ్య మాటలు బట్టి తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: