అందరూ అనుకున్నట్టుగానే ఏపీ ఎన్నికల కమిషనర్ హైకోర్టు తీర్పు పై జగన్ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కి వెళ్లడం జరిగింది. గతంలో రాజ్యాంగబద్ధంగా కొత్త ఆర్డినెన్స్ ద్వారా ఏపీ ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి  ఆటోమేటిక్ గా పోయేలా జగన్ సర్కార్ వ్యవహరించటం అందరికీ తెలిసిందే. కారణం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వంతో చర్చించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించడంతో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

IHG

అయితే తన పదవి, విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించడాన్ని ఏపీ ప్రభుత్వం పనితీరుపై నిమ్మగడ్డ  హైకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను గురించి ప్రస్తావించి నిబంధనలకు విరుద్ధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టిపారేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం మనకందరికీ తెలిసిందే.

IHG

అయితే తాజాగా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు జగన్ కీలకమైన పాయింటుతో వెళ్ళటంతో న్యాయ నిపుణులు చెప్పిన దాని ప్రకారం అత్యున్నత న్యాయస్థానంలో జగన్ గెలవడం తధ్యం అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే గతంలోనే 2008వ సంవత్సరంలో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి న్యాయస్థానాలు కలుగజేసుకోకూడదని తీర్పు సుప్రీం కోర్ట్ ఇవ్వడం జరిగింది. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్ గెలుపు తధ్యం అనే టాక్ వినపడుతోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: