సాధారణంగా మనకు తెలంగాణ అనగానే ఠక్కున గుర్తొచ్చే బతుకమ్మ, బోనాలు, హదరాబాద్ బిర్యానీ పక్కన కొత్తగా యాపిల్‌ చేరింది... మినీ కశ్మీరంలా పేరొందిన కుమ్రంభీం ఆసిఫాబాద్‌లోని కెరమెరి అటవీప్రాంతంలో తెలంగాణ యాపిల్‌ నెలరోజుల్లో కోతకు రానున్నది.   ఏడాదిలో ఎక్కువకాలం కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ప్రాంతం యాపిల్‌సాగుకు అనుకూలంగా ఉన్నది. ఔత్సాహిక రైతు బాలాజీ ప్రయోగాత్మకంగా చేసిన యాపిల్‌సాగు ఫలప్రదమైంది.  కేవలం జమ్మూ కాశ్మీర్ లో యాపిల్స్ పండుతాయి.. అక్కడి చల్లటి వాతావరణ పరిస్థితులు బాగా అనుకూలిస్తాయని అంటారు.  చల్లని వాతావరణంలో పండే ‘ఆపిల్’ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సాగు చేస్తున్నారు.

IHG

ఈ మేరకు 2020, మే 25వ తేదీ సోమవారం తన తోటలోని యాపిల్‌ పండ్లను కోయబోతున్నారు. మొదటిసారిగా కాసిన యాపిల్‌ పండ్లను 2020, మే 26వ తేదీ మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌కు  అందించనున్న విషయం తెలిసిందే.. తాజాగా  తొలిసారిగా పండిన ఆపిల్ పండ్లను ఆ రైతు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించడానికి హైదరాబాద్ వచ్చారు.  కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజీ మంగళవారం ప్రగతి భవన్‌లో ఆ పండ్లను కేసీఆర్‌కు అందించారు. హైదరాబాద్‌కు రావాల్సిందిగా సీఎం పేషీ అధికారులు సోమవారం రాత్రి సూచించారని.. తెలంగాణ ఆవిర్భావం రోజున సీఎం కేసీఆర్‌ను కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని బాలాజీ ఆనందం వక్తంచేశారు.

IHG'యాపిల్‌ పండు'గొచ్చింది!

అంతే కాదు రెండు ఎకరాల్లో ఆపిల్ పంట సాగు చేశాను. తొలి పంటను సీఎం కేసీఆర్‌కు ఇవ్వడం గర్వాంగా ఉంది. సీఎం కేసీఆర్ చెప్పినట్లు పంటలు వేస్తే రైతులు లాభల బాటలో నడుస్తారు. ఆపిల్ పంటకు సబ్సిడీ ఇస్తాం అని కేసీఆర్ చెప్పారు. ఈ పంటపై రైతన్నలకు నా సూచనలు సలహాలు ఇస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో ఇవాళ ఈ పంట నా చేతికి వచ్చింది’ అని బాలాజీ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: