మూడేళ్లు బిక్షం ఎత్తాడు ఓ బిక్షాగాడు..లక్షల్లో ఎవరి కీ తెలియని అంత గా కుడా బెట్టడు..కానీ అతను చూడటాని కి ఏమి లేనట్టు ఉండేవాడు..ఈ ఘటన కర్నూల్ లో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా డోన్‌ పట్టణంలోని కొండపేట బీసీ హాస్టల్‌ పక్కన ఉన్న మసీదు వద్ద భిక్షాటన చేసే వ్యక్తి నుంచి భారీ గా నగదు బయట పడింది. శ్రీను అనే వ్యక్తి వద్ద రూ.2,04,459 నగదు లభించింది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ కు చెందిన శ్రీను అనే వృద్ధుడు మూడేళ్ల నుంచి డోన్‌లో భిక్షాటన చేస్తున్నాడు. స్థానికుల వినతి మేరకు అతడికి సపర్యలు చేసేందుకు ద్రోణాచలం సేవా సమితి సభ్యులు సోమవారం ఉపక్రమించారు.

 

 

 


అతని వద్ద ఉన్న 14 చొక్కాల్లోని ప్లాస్టిక్‌ కవర్లలో మడత వేసి ఉంచిన రూ. 2.04 లక్షల విలువై న నోట్ల ను గుర్తించారు. దీంతో మహబూబ్‌నగర్‌ పోలీసుల సహాయం తో శ్రీను చిరునామా తెలుసు కునేందుకు డోన్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ద్రోణా చలం సేవా సమితి సభ్యులు తెలిపారు.. అతని వద్ద ఉన్న డబ్బును అతన్ని వారి కుటుంబాని కి అందించాల ని వారు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.. 

 

 

 


గతంలో కూడా తూర్పు గోదావరి జిల్లాలో ఓ యాచకుడి వద్ద భారీ డబ్బు చిక్కింది. చాలాకాలం పాటు భిక్షాటన చేసిన ఓ వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆయన మృతదేహాన్ని తరలించే క్రమంలో బట్టలు చూడగా భారీగా డబ్బు బయటపడింది. అలాంటి ఘటన ఈయన బ్రతికుండగానే తెలియడంతో అందరూ కంటతడి పెడుతున్నారు..అంతేకాదు ఇలాంటి వృద్ధులను వదిలేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని స్థానికులు మానవత్వం తో డిమాండ్ చేస్తున్నారు..ప్రస్తుత ఈయన ఉన్న రోజులు తమ కుటుంబంతో గడిపెలా చూడాలని కోరుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: