ఈ మద్య విద్యార్థులు చాలా సున్నితంగా ఆలోచిస్తున్నారు.. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ర్యాంకుల కోసం పోటీ పడటం.. ఆ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా మనసు వికలం చేసుకోవడం దాంతోఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఎన్నాయి. మార్చి నుంచి కరోనా వైరస్ ప్రభావంతో విద్యా వ్యవస్థలు అన్నీ మూతపడ్డ విషయం తెలిసిందే.  పదవ తరగతి ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. అప్పటి నుంచి కొన్ని ప్రైవేట్ కళాశాలలు, విద్యాస్థంస్థలు, ఇనిస్ట్రిట్యూట్స్ ఆన్ లైన్ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకాలేకపోతున్నానని మనస్థాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. షెడ్యూల్‌ క్యాస్ట్‌కు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలిక ఆన్‌లైన్‌ తరగతులను యాక్సెస్‌ చేయలేకపోతున్నానని మనస్థాపం చెంది శరీరానికి నిప్పంటించుకుని మృతిచెందింది. 

 

టెక్నాలజికల్ క్లాసులకు అటెండ్ అవడం ఆమెకు కుదరకపోవడం ఇలా జరిగిందని విద్యాశాఖ మంత్రి సీ రవీంద్రనాథ్ జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ చేశారు. వలంచేరి దగ్గర్లోని మంగేరీ ప్రాంతంలో ఉన్న ఇంటింకి దగ్గర్లో 14ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. రోజువారీ కూలీ అయిన తన తండ్రి మిస్సింగ్ అయినట్లు గుర్తించి వెదకడంతో ఆమె దొరికింది.  ప్రాథమిక విచారణలో దీనిని ఆత్మహత్యగా గుర్తించారు. చావుపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కేఎమ్ షాజీ చెప్పారు. మొదటి రోజు క్లాసులకే తాను హాజరుకాలేకపోయానని.. తమ కూతురు కుమిళిపోయిందంటూ తల్లీదండ్రి వాపోయారు.

 

మృతురాలి తండ్రి స్పందిస్తూ... ఇంట్లో టీవీ ఉంది... అది పనిచేయడం లేదు. దాన్ని రిపేర్‌ చేయించమని అడిగింది. కానీ నేను చేయించలేకపోయా. ప్రస్తుతానికి స్నేహితుల ఇంటికి వెళ్లి క్లాసులు వినే ఆప్షన్‌ను చూసుకుందామని చెప్పా..  అయినా ఇంతటి అఘాయిత్యానికి ఎందుకు పాల్పడిందో అర్థం కావడం లేదు. ఘటనపై సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ... బాధిత కుటుంబం చాలా పేదది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన చదువు కొనసాగదని బాలిక భావించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: