ఈ మధ్య కాలంలో దేశంలోని అన్ని రంగాల్లో, విభాగాల్లో శరవేగంగా మార్పులు వస్తున్నాయి. కేంద్ర కొత్త కొత్త అయుధాల సమీకరణ, ఇతర దేశాల నుంచి యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడం, ఎచ్.ఏ.ఎల్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎయిర్ ఫోర్స్, నావీ, ఆర్మీని త్రివిధ దళాలు అంటారని అందరికీ తెలిసిందే. ఆర్మీలో పని చేసేవారు నిత్యం మన భూభాగాన్ని కాపాడటం కోసం, ఇతర దేశాల నుంచి భారత్ లోకి వచ్చేవారితో పోరాడటం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. 
 
భారత్ పాక్ కు ఎల్లప్పుడూ యుద్ధాలుజరుగుతునే ఉంటాయి. పాక్ సైనికులు భారత సైనికులపై కాల్పులు జరపడం... మనం రివర్స్ లో వారిపై కాల్పులు జరపడం తెలిసిందే. ఆర్మీలో ఉన్నవారికి సాధారణంగా శిక్షణ ఇవ్వాలంటే కొంతకాలం పాక్ సరిహద్దుల్లో ఉంచుతారు. పాక్ సరిహద్దుల్లో 24 గంటలు యుద్ధ వాతావరణం ఎల్లప్పుడూ నెలకొని ఉండటంతో వారు ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉంటారు. 
 
త్రివిధ దళాలలోని నావీకి, ఎయిర్ ఫోర్స్ కు ఇలాంటి అనుభవాలు ఉండవు. గతంలో కార్గిల్ యుద్ధం సందర్భంలో ఎయిర్ ఫోర్స్ సేవలను కూడా వినియోగించుకున్నారు. బాలాకోట్ దాడుల సందర్భంలో కూడా ఎయిర్ ఫోర్స్ ను వినియోగించుకున్నారు. ప్రస్తుతం కేంద్రం ఎలాంటి సందర్భంలోనైనా సిద్ధంగా ఉండేందుకు ఎయిర్ ఫోర్స్, నావీ వాళ్లకు కూడా ఆర్మీ నుంచి ప్రస్తుతం శిక్షణ ఇప్పిస్తున్నారు, 
 
మోదీ భవిష్యత్తులో యుద్ధ వాతావరణం ఏర్పడినా ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం ఎయిర్ ఫోర్స్, నావీ సిబ్బందిని అన్ని విధాలుగా ఉపయోగపడేలా సిద్ధం చేయిస్తున్నారని తెలుస్తోంది. భారత్ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మోదీ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మోదీ ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తూ ఉండటం గమనార్హం.                      

మరింత సమాచారం తెలుసుకోండి: