ఈ పోలిక ఏదో వెరైటీగా ఉంది కదూ.  జగన్ విషయంలో కూడా అదే జరుగుతోందా. ఆయన కూడా అలాగే ఉంటున్నారా. జగన్ కి ఏపీలో జరుగుతున్న విషయాలు అన్నీ తెలియవా. ఆయనకు తెలియనీయకుండా చేస్తున్న‌ది ఎవరు. ఆయన చుట్టూ ముళ్ళ కంచె ఉంది, దాన్ని దాటుకుని వెళ్లడం కష్టమని సాక్షాత్తూ అదే పార్టీకి చెందిన ఎంపీగారు అన్నారంటేనే ఇదేదో చూడాల్సిన వ్యవహారమే  మరి.

 

నిజానికి అధికారం చుట్టూ కోటరీ ఉంటుంది. అది జగన్ అయినా చంద్రబాబు అయినా వేరొకరు అయినా. ఇది చాలా సింపుల్. ఈ విషయంలో కొంతమంది మాత్రేమే కోటరీని కూడా ఛేదించగలరేమో. జగన్ విషయంలో అది జరగలేదు అని ఇంతవరకూ అందరూ అనుకున్నారు. కానూ  వైసీపీకే చెందిన ఎంపీ రఘురామక్రిష్ణంరాజు మాత్రం జగన్ చుట్టూ కూడా అతి పెద్ద  కోటరీ ఉందని అంటున్నారు.

 

జగన్ మంచివారు, ఆయన మనసు మల్లెపూవు లాంటిది. అయితే చుట్టూ ఉన్న కోటరీ మాత్రం ముళ్ళు లాంటి వారు అని కూడ చెబుతున్నారు ఈ ఎంపీ గారు. ఈ ముళ్ల కంచెను దాటుకుంటూ జగన్ని చేరుకోవడం ఎవరికైనా కష్టమేనని కూడా అంటున్నారు. ఏపీలో ఇసుక పాలసీ విషయంలో జగన్ సర్కార్ తప్పులు చేస్తోందని ఓ మీడియా డిబేట్ లో బాహాటంగా రఘురామ క్రిష్ణంరాజు కుండబద్దలు కొట్టడం విశేషం

 

ఈయన నర్సాపురం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గెలిచిన కొత్తల్లోనే బీజేపీకి సన్నిహితంగా ఉంటున్నారని వైసీపీ హై కమాండ్ ఆయన్ని దూరం పెట్టిందని అంటారు.ఆయన నియోజకవర్గంలో వేరేగా మాజీ ఎంపీ గంగరాజు కుమారుడికి పార్టీ పగాలు అప్పగించారని కూడా అంటారు. ఇవన్నీ ఇలా ఉంటే రఘురామ క్రిష్ణంరాజు వైసీపీపై తన విమర్శలు సుతిమెత్తగా మొదలుపెట్టి ఇపుడు రాగం పెంచారని అంటున్నారు.

 


నిజంగా వైసీపీ సర్కార్ ఇసుక పాలసీ విషయంలో తప్పుడు విధానం అనుసరిస్తే నేరుగా సీఎంకి చెప్పాలి కానీ ఇలా బాహాటంగా విమర్శలు చేయడం తగదని అంటున్న వారు కూడా ఉన్నారు. ఏది ఏమైన జగన్ మీద బాణాలు వేసిన ఎంపీ గారి విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: