తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో గడచిన వారం రోజుల నుంచి 7,000కు పైగా కరోనా కేసులు నమోదు కాగా గత రెండు రోజుల నుంచి 8,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు పల్లెలకూ చేరింది. 
 
కేంద్రం వలస కూలీలకు సొంతూళ్లకు అనుమతులు ఇవ్వడంతో వాళ్లు సొంతూళ్లకు చేరుకున్నారు. సొంతూళ్లకు చేరుకున్న వలస కూలీలలో ఎక్కువ మంది కరోనా భారీన పడటం గమనార్హం. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పల్లెలు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా మామిడాడ గ్రామంలో 54 కేసులు నమోదు కాగా ఒక్క వ్యక్తి వల్ల ఈ కేసులు నమోదయ్యాయి. 
 
ఆ ఒక్క వ్యక్తి నుంచి ఇప్పటివరకు 82 మందికి కరోనా సోకడం గమనార్హం. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 18 మందికి కరోనా సోకగా గుంటూరులో ఒక వ్యక్తి నుంచి 17 మందికి కరోనా సోకింది. పేకాట, అష్టాచమ్మా ఆటల ద్వారా కూడా పల్లెల్లో కరోనా వైరస్ విజృంభించింది. నెలరోజుల క్రితం వరకు పట్టణాలకే పరిమితమైన కరోనా ప్రస్తుతం పల్లె ప్రాంతాలకు పాకుతోంది. 
 
కరోనా విజృంభణ వల్ల ప్ర్జలెవరూ సురక్షితంగా, ప్రశాంతంగా లేరు. అలా అని భయాందోళనకు గురై టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. పల్లె ప్రాంతాల్లో కూడా కరోనా విజృంభిస్తూ ఉండటంతో కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కరోనా ఎప్పుడు, ఎక్కడ, ఎవరినుంచి సోకుతుందో ఎవరూ చెప్పలేరు కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా సోకకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: