భారత సైన్యం ఎన్ని సార్లు ఉగ్రమూకల దాడులను తిప్పికొట్టినా.. ఎన్ని సార్లు బుద్ది చెప్పినా.. వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ వెళ్తున్నారు.  గత ఏడాది పుల్వామా లాంటి దాడికి మళ్లీ ప్రయత్నం చేయగా ఆ ప్లాన్ భగ్నం చేశారు భారత సైనికులు.  ఇలా ఎప్పటికప్పుడు దొంగ దారులు వెతుక్కుంటున్నారు. కానీ భారత సైన్యం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను చీల్చి చెండాతున్నారు.  తాజాగా జిల్లాలోని హిరానగర్‌ సెక్టార్‌లో ఇంటర్నేషనల్‌ బోర్డర్‌ (ఐబి) వెంబడి ఫార్వర్డ్‌ పోస్టులు, గ్రామాలపై కాల్పులు జరపడం ద్వారా పాకిస్తాన్‌ రేంజర్స్‌ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు భద్రతా దళ అధికారులు తెలిపారు.  సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్‌) లక్ష్యంగా నిన్న ఉదయం 10.50 గంటల ప్రాంతంలో కరోల్‌ సరిహద్దు అవుట్‌పోస్ట్‌ ప్రాంతంలో సరిహద్దు దాటి పాకిస్తాన్‌ దళాలు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. 

 


అయితే ఉగ్రవాదులు దాడులు జరిపే సమయంలో సైనికులు వెంటనే వారికి ధీటుగా జవాబు చెప్పి ఫైరింగ్ మొదలు పెట్టారు. ఇరువర్గాల మధ్య సరిహద్దు కాల్పులు రాత్రంతా కొనసాగుతూ తెల్లవారుజామున 4.30 గంటలకు ముగిశాయని అధికారులు తెలిపారు.పాక్‌ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదని అధికారులు తెలిపారు.  మరోవైపు రాజౌరి జిల్లాలోని కలాల్‌ ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ  పాకిస్తాన్‌ కాల్పులు జరిపిన పాకిస్తాన్‌ స్థావరం మోర్టార్‌ షెల్‌ను భారత సైన్యం నిర్వీర్యం చేసింది.  షెల్‌ ఉన్న ప్రదేశం  ఉన్న బాంబులను పారవేయడంతో వాటిని మొత్తం సైనికులు నిర్వీరయ్యం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: