ఒడిస్సా రాష్ట్రంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఢెంకనాల్‌ జిల్లాలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. నిన్నటి రోజున అనగా సోమవారం నాడు గోవిందపూర్ గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గోవిందపూర్ గ్రామానికి చెందిన జితేంద్రకుమార్ బెహరా తన ఇద్దరు సోదరులకు కుటుంబాలతో కలిసి ఒకే ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు కాగా వారికి చెందిన పిల్లలు రాజేష్, తృప్తి మాయ, ప్రీతి బాల, నిషాల్‌ సోమవారం ఉదయం చదువుకున్న తర్వాత గ్రామ శివారు లోని ఉన్న చెరువులో స్నానం చేసేందుకు అక్కడికి వెళ్లారు.

 

అలా వెళ్లిన పిల్లలు ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు వారి కోసం చెరువు దగ్గరకు వెళ్లి వెతికారు. అలా వెళ్లి చూడగా ఆచూకీ లభించకపోవడంతో వెనుతిరుగుతున్న సమయంలో చెరువులో ఓ బాలిక మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు సాయంతో చెరువులో పూర్తిగా గాలించడంతో మొత్తం నలుగురు చిన్నారులు కనిపించారు. అయితే వెంటనే వారిని ఆస్పత్రికి తరలించిన అప్పటికే సమయం చేజారిపోయింది. వారందరూ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనితో ఆ కుటుంబంలో మాత్రమే కాకుండా గ్రామంలో మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి.

 

ఇక ఈ సంఘటన విషయాన్ని తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలకు సహాయంగా రూ 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత గ్రామంలోని స్మశానవాటికలో కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నారులకు అంత్యక్రియలు జరిపించారు. గంటల వ్యవధిలో తమ ముందే ఆడుకుంటున్న పిల్లలు అందరూ ఇలా విగతజీవులుగా మారడంతో అందరూ హృదయ విదారక మనసుతో దుఃఖించి పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: