ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం ఏపీ రాజకీయాలని హీటెక్కిస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి ఎలక్షన్ కమిషనర్ పదవీకాలం తగ్గించడంతో, నిమ్మగడ్డ పదవిని కోల్పోయారు. ఆ వెంటనే జస్టిస్ కనగరాజ్‌ని కొత్త ఎస్‌ఈసిగా నియమించారు. అయితే తనని పదవి నుంచి తప్పించడంతో నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కూడా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు.

 

ఈ పిటిషన్లని విచారించిన హైకోర్టు, జగన్ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, ఆర్డినెన్స్ కొట్టేస్తూ, నిమ్మగడ్డకు మళ్ళీ ఎస్‌ఈసి బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళగానే, కామినేని కూడా సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. కేవియట్ పిటిషన్ అంటే హైకోర్టు తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా వేసే పిటిషన్. అయితే పార్టీ అనుమతి పొందాకే పిటిషన్ వేసినట్లు కామినేని చెబుతున్నారు.

 

అయితే ఇలా నిమ్మగడ్డకు సపోర్ట్ చేస్తూ, జగన్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చేలా కామినేని పిటిషన్లు దాఖలు చేయడానికి కారణాలు లేకపోలేదు. ఆయన ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నా సరే, ఇంకా చంద్రబాబు మనిషిగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు కేబినెట్ లో పనిచేసిన కామినేని, టీడీపీతో పొత్తు విడిపోయాక పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ సమయంలో అందరు బీజేపీ నేతలు బాబుపై విమర్శలు చేస్తే, కామినేని మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎన్నికల సమయంలో కూడా పోటీకి దూరంగా ఉంటూ సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే నిమ్మగడ్డ, చంద్రబాబు, కామినేనిలది ఒకే సామాజికవర్గం. అందుకే అనుకుంటా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కామినేని ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: