ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ లోకి వస్తారా వస్తే ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తారు అన్నది ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు అందరిలో ఉన్న ప్రశ్న.  అయితే జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీ లో అందరికి అభిమానమే. కానీ పార్టీ అధ్యక్ష పదవి విషయానికొస్తే మాత్రం కొంతమంది లోకేష్ చంద్రబాబు వీరిలో  ఎవరైనా ఒక అధ్యక్షులు కావాలని కోరుకుంటే...  ఇంకొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్షుడు కావాలి అని కోరుకుంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టిడిపి పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ప్రచారంలో ఎన్నో  రోజుల పాటు తన దైన శైలిలో ప్రచారం నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల తర్వాత మాత్రం కనిపించకుండా పోయారు. 

 

 జూనియర్ ఎన్టీఆర్ ని టిడిపి కావాలనే పక్కన పెట్టేసింది అనే వాదన అప్పట్లో బలంగా వినిపించింది. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ అయిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ను కావాలని రాజకీయంగా ఎదగడానికి అంతగా సపోర్ట్ చేయడం లేదు.. బాలకృష్ణ కు  జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అంత ఇష్టం లేదు అన్న వాదన కూడా బలంగా వినిపించింది. అయితే దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు చంద్రబాబు తర్వాత లోకేష్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తాడు అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. అంటే అతను స్వయానా అల్లుడు కాబట్టి లోకేష్ కోసం  జూనియర్ ఎన్టీఆర్ ని కాస్త సపోర్ట్ చేయకుండా అవాయిడ్ చేస్తున్నారు అన్నది చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. 

 


 మరి బాలకృష్ణ మనసులో ఏముంది జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయంగా సపోర్ట్ చేయాలని ఉందా లేదా అన్న విషయం మాత్రం తాజాగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైపోయింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు బాలకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్  రాజకీయాల్లోకి రావడం అనేది అతని వ్యక్తిగత విషయమని అయితే ఇది  అతని ఇష్టాయిష్టాలతో ఆధారపడి ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు బాలకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ కి నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉంది.. ఈ నేపథ్యంలో వృత్తి ని వదులుకొని రాజకీయాలలోకి రమ్మని నేను చెప్పలేను. కానీ గతంలో మా తండ్రి ఎన్టీఆర్ ప్రస్తుతం నేను అటు రాజకీయాలను సినిమాలను బాలన్స్ చేస్తూనే వస్తున్నాము అంటూ  వ్యాఖ్యానించారు. అయితే గతంలో సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయాలను బ్యాలెన్స్  చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చేయలేడు  చేయగలడు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు కాబట్టే ఇలా బాలకృష్ణ వ్యాఖ్యానించాడు అంటున్నారు కొంతమంది విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: