విశాఖలో జరిగిన ఎల్జి పాలిమర్స్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దేశంలోనే మొట్టమొదటి సారి ఒక కంపెనీ నుంచి స్టైరిన్ అనే విషవాయువు వెలువడి ఏకంగా ఎన్నో మూగజీవాలను ఎంతో మంది ప్రజలను బలి తీసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అటు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తోపాటు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ మానవహక్కుల కమిషన్ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణం లేదా పొరపాటున ప్రమాదవశాత్తు అలా జరిగిందా అనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్ జి పాలిమర్స్ అనే కంపెనీ గురించి రోజుకు ఒక్కో  నిజం బయటకు వస్తూనే ఉంది. 

 


 తాజాగా ఎన్జీటీ ఇచ్చినటువంటి నివేదికలో కంపెనీకి సంబంధించినటువంటి... యాజమాన్యానికి  యావజ్జీవ కారాగార శిక్ష వేసిన తక్కువే అన్నటువంటి నిజాలు బయటపడ్డాయి . ఎన్జీటీ తెలిసిన నిజాలు ఏమిటి... స్టైరిన్ ఉన్న ట్యాంక్ ఉష్ణోగ్ర ఉష్ణోగ్రత ఎప్పుడూ 17 నుంచి 20 డిగ్రీల దాటకూడదు.. గరిష్టంగా 25 డిగ్రీలు  గనుక దాటింది అంటే అది పెను ప్రమాదానికి దారితీస్తుంది. దీనిపై ట్యాంక్  నిర్వాహకులు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ట్యాంక్  కి ఈ ఉష్ణోగ్రత దాటకుండా ఎప్పుడు రిఫ్రిజిరేషన్ జరుగుతూ ఉండాలి. 

 


 కానీ విశాఖ లో గ్యాస్ లీకేజీ ప్రమాదం జరగడానికి ఒక రోజు ముందు నుంచి ట్యాంక్  రిఫ్రిజిరేషన్ ఆగిపోయింది . వాస్తవానికి పై నుండి కింది వరకు టెంపరేచర్ సూచించే మిషన్లు ఉండాలి  కానీ అవి మాత్రం లేవు . అలాగే ట్యాంక్  కి ఎలాంటి సెన్సర్స్ కూడా లేవు. గ్యాస్ లీక్ ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తం చేసేందుకు  అలారం కూడా లేదు. అంతేకాకుండా ఇలా ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు  కంట్రోల్ చేయడానికి  రసాయనం కూడా కంపెనీలో  లేదు. కానీ ఈ రసాయనం తమ కంపెనీ లో ఉంది అని యాజమాన్యాలు బుకయించాయి. ఇలా రోజురోజుకు ఎల్జీ  పోలిమెర్స్  కు సంబంధించి అన్ని నిజాలు బయటపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: