ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యమైన అమెరికా లో ప్రస్తుతం దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జాతివివక్ష అనే రోగం దేశవ్యాప్తంగా వ్యాపించింది. నల్లజాతీయులు తెల్లజాతీయులు అనే అస్త్రాన్ని ప్రస్తుతం అక్కడ కొంతమంది ప్రయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు ట్రంప్ కి వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులను సృష్టించడంతో పాటు ఎన్నో ఉద్యమాలను కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమాలను అణచి వేయడానికి ట్రంప్ ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దింపుతాను అంటూ వ్యాఖ్యానించడం కూడా సంచలన గా మారిపోయింది. కానీ అక్కడ పేరుకుపోయిన జాతి వివక్ష మాత్రం రోజు రోజుకి మరింత దారుణం పరిస్థితులకు దారి తీస్తుంది.
అయితే ఈ జాతి వివక్ష వెనుక బలమైన కుట్ర ఉంది అని అర్థం అవుతున్నప్పటికీ.. చాలామంది మాత్రం ఈ జాతి వివక్ష అనే కారణంతో ఎన్నో దారుణాలకు కూడా పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఏకంగా అమెరికా అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ బంకర్ లో దాక్కున్నాడు అని అక్కడి మీడియా ఒక ప్రచారం మొదలు పెట్టింది. దీని గురించి ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.. ఏకంగా అమెరికాలో ఉద్యమాలు చేస్తున్న ఉద్యమకారులు వైట్ హౌస్ దగ్గర ఉన్న బారికేడ్లను తగలబెట్టి మరి... లోపలికి చొచ్చుకు వచ్చిన ప్రాంతంలో ఏకంగా ట్రంప్ సహ తన కుటుంబ సభ్యులందరినీ బంకర్ లోకి పంపించి దాచిపెట్టారు అనటువంటి ప్రస్తుతం అక్కడ కొన్ని మీడియా లలో ప్రచురితం చేసింది.
వాస్తవంగా అయితే అమెరికాలో మొదటి నుంచి కొన్ని మీడియాలు ట్రంప్ కి వ్యతిరేకంగానే ఉన్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు గా ట్రంప్ అవ్వడాన్ని మొదటినుంచి జీర్ణించుకోలేకపోతున్నాయి కొన్ని మీడియాలు. ముఖ్యంగా అమెరికాలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న పురాతన మీడియా సైతం కు ట్రంప్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ట్రంప్ బంకర్ లో దాక్కున్నాడు అనడంలో కూడా నిజం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు. అయితే జాతివివక్ష అనేది ఒక దారుణమైన కుట్ర అని.. జాతి వివక్ష కారణంగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది అని అంటున్నారు విశ్లేషకులు.