కర్ణాటకలో వచ్చే నెల 1నుండి పాఠశాలలు తెరవడానికి  ప్రభుత్వం అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది . విద్యాసంస్థల విషయాన్ని కేంద్రం కూడా రాష్ట్రాలకే వదిలేయండతో కర్ణాటక సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1నుండి  దశల వారీగా పాఠశాలను తెరవనుంది. ఇకమరోవైపు కర్ణాటక లో కరోనా విజృంభిస్తుంది. ఈఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 388 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 3796కు చేరింది. 
 
ఇక కేరళలోను ఈరోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈఒక్క రోజే రాష్ట్రంలో 86 కేసులు నమోదయ్యాయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది, ఈ కొత్త కేసుల తో కలిపి  కేరళ లో మొత్తం కేసుల సంఖ్య 1412కు చేరగా అందులో  627మంది బాధితులు  కోలుకున్నారు. ఈ రోజు ఓ మరణం కూడా చోటుచేసుకోవడం తో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11 కు చేరింది.  ప్రస్తుతం 774కేసులు యాక్టీవ్ గా వున్నాయి. 
 
 
మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీగా కేసులునమోదయ్యాయి అందులో భాగంగా తమిళనాడు లో   కొత్తగా 1091కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో 82 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణ లో  ఈరోజు 899కేసులు నమోదుకాగా నలుగురు మరణించారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: