బాలయ్య బాబు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. మొన్న ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వ మంత్రులతో ముఖ్యమంత్రులతో సమావేశం అవ్వటం తనని పిలవకపోవడం పై బాలయ్య బాబు సీరియస్ వ్యాఖ్యలు చేయడం మనకందరికీ తెలిసిందే. అది రాజకీయ రంగంలోనూ అటు సినిమా రంగంలోనూ చాలా పెద్ద వివాదాస్పదంగా మారింది. ఆ మంటలు ఇంకా ఆరక ముందే ఇటీవల బాలయ్య బాబు ప్రముఖ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు  నందమూరి అభిమానులను తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నట్లు సమాచారం.

 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ పాల్గొన్న సమయంలో యాంకర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య బాబు జవాబిస్తూ...తారక్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే అతని ఇష్టం. అయినా గాని సినిమా ఇండస్ట్రీలో తారక్ కి మంచి భవిష్యత్తు ఉంది. ఇటువంటి సమయంలో సినిమా ఇండస్ట్రీ వదులుకొని పాలిటిక్స్ లో రమ్మని చెప్పటం న్యాయం కాదు అన్నట్టుగా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అదే టైంలో మరోపక్క తండ్రి ఎన్టీఆర్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలు కూడా చేశారు నేను ఆ విధంగానే ప్రస్తుతం చేస్తున్నాను అని తనదైన శైలిలో జవాబిచ్చారు. అయితే బాలయ్య చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ ని ఇన్ డైరెక్ట్ గా రాజకీయాల్లోకి రావద్దు అన్నట్టుగా ఉన్నాయని అంటున్నారు.

 

నిజంగా బాలయ్య బాబు కి తారక్ టీడీపీ లోకి రావాలి అని మనసులో ఉంటే ఈ విధంగా మాట్లాడేవారు కాదని… ప్రస్తుతం పార్టీ ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఎవరైనా ఈ టైంలో పార్టీలోకి వస్తారంటే తీసుకుంటారు అటువంటిది తారక్ గురించి బాలయ్య ఈవిధంగా మాట్లాడటం బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ని ఇండైరెక్టుగా రావద్దు అని అన్నట్లుగానే వ్యవహారం ఉందని చాలా మంది భావిస్తున్నారు. మరోపక్క తెలంగాణ ఎన్నికల టైంలో కుక్కట్ పల్లి నియోజకవర్గం టిడిపి కాండేట్ గా నందమూరి హరికృష్ణ కూతురు పోటీ చేసిన టైములో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవటం వలనే బాలయ్య బాబు ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ పార్టీలో మరో వర్గం వ్యాఖ్యానిస్తోంది. సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేయొచ్చు అని పర్టిక్యులర్ గా బాలయ్య బాబు కుక్కట్ పల్లి నియోజకవర్గం ఎన్నికల విషయం మైండ్ లో పెట్టుకుని ఇండైరెక్టుగా జూనియర్ ఎన్టీఆర్ కి డైలాగ్ వేసినట్లు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: