రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు ఉన్నా.. పేదలను ఆదుకునే విషయంలో ఏపీ సీఎం జగన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. వందల కోట్లు, వేల కోట్లు అయినా సరే లెక్క చేయడం లేదు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం ఎందాకైనా అన్నట్టు ముందుకు సాగుతున్నాడు ఏపీ సీఎం జగన్. తాజాగా ఆయన పేద ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం చూస్తే ఔరా అనిపించకమానదు.

 

 

ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే.. గత ప్రభుత్వం గృహ నిర్మాణ రంగంలో పెట్టిన బకాయిలను జగన్ తీరుస్తున్నాడు. ఈమేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. హౌసింగ్‌పై గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను పేదలకు చెల్లించాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో హౌసింగ్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

 

గత ప్రభుత్వ హయాంలో 3,38,144 ఇళ్లకు గాను రూ.1323 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ బకాయిలు వెంటనే చెల్లించేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టినా, ఈ ప్రభుత్వం పెట్టినా పేదలకు న్యాయం జరగాల్సిందేనని.. సాయం అందాల్సిందేనని జగన్ అధికారులతో అన్నారట.

 

 

పేదలకు అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పిన సీఎం జగన్.. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా చెల్లింపులు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ఇస్తానంది.. ఇవ్వకుండానే వెళ్లిపోయింది. మాకేం సంబంధం అని తప్పించుకునే అవకాశం ఉన్నా.. జగన్ సర్కారు అలాంటి పని చేయలేదు. ఇవే కాదు. ఇటీవలి కాలంలో ఇలాంటి బకాయిలు జగన్ సర్కారు ఎన్నో చెల్లించాల్సి వచ్చింది. అయినా జగన్ వెనుకంజ వేయలేదు. మరి అసలే ఆర్థిక కష్టాల్లో ఉంటే మరి జగన్ ఎక్కడ డబ్బు తెస్తున్నాడో అంటూ విశ్లేషకులు విస్తుపోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: