భారత్ చైనా వివాదం రోజురోజుకు ముదురుతోంది. చైనా భారత్ ను అమెరికాకు, చైనాకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తల దూర్చవద్దని హెచ్చరించింది. అమెరికా, చైనా వివాదానికి భారత్ దూరంగా ఉంటే మంచిదని చైనా ప్రభుత్వ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ లో కథనం ప్రచురితమైంది. అయితే అమెరికా ఈ వ్యవహారం గురించి  అమెరికా స్పందిస్తూ భారత్, ఆస్ట్రేలియా లాంటి స్నేహితులకు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొంది. 
 
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల చైనా తమ సైనిక బలగాలను భారత్ సరిహద్దుల్లోకి తరలించిందని... నియంతృత ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని వ్యాఖ్యలు చేశారు. భారత్ సరిహద్దుల్లో బలగాల మోహరింపును చైనా కొనసాగిస్తూనే ఉందని పాప్ అన్నారు. చైనా గత కొన్నేళ్లుగా ఇదే తరహా వైఖరిని అవలంబిస్తోందని వ్యాఖ్యలు చేశారు. 
 
మరోవైపు భారత్ చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర నెలకొన్న టెన్షన్ ఇంకా తగ్గలేదు. ఇరు దేశాల సైన్యాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. ఇదే సమయంలో చైనా ఆర్మీ చొరబాట్లకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. చైనా ఆర్మీ భారత్ భూభాగంలోని గాల్వాన్ నదీ జలాలను మళ్లించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తేలింది. 
 
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భార్ చైనా వివాదం గురించి మరోసారి స్పందించారు. చర్చలు జరుగుతున్న సమయంలో చైనా కవ్వింపు చర్యలకు దిగడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా ఒకవైపు చర్చలు జరుపుతూ మరోవైపు తన బలగాలను పెద్ద ఎత్తున మోహరిస్తోందని అన్నారు. ప్రస్తుతం చైనా భారత్ మధ్య చర్చలు జరుగుతున్నాయని.... అందువల్ల చైనా పన్నాగాలపై వ్యాఖ్యలు చేయబోనని... లేని పక్షంగా ఖచ్చితంగా తాను ఘాటుగా స్పందించేవాడినని వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: