సినీ హీరో నందమూరి బాలకృష్ణ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఒకవైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలు ఇలా రెండిటినీ సమానంగా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇది ఇలా ఉంటే, కొద్ది రోజుల క్రితం సినిమా ఇండస్ట్రీ పెద్దలతో బాలయ్యకు ఏర్పడిన వివాదం రోజు రోజుకు . ముదురుతోనే ఉంది. సినీ పెద్దలు కొంతమంది కరోనా ఛారిటీ క్రైసిస్ పేరుతో ఓ కమిటీని వేసుకోవడం, తెలంగాణ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం కేసీఆర్ ను కలవడం తెలిసిందే. ఈ విషయం తను పట్టించుకోకుండా కనీసం తనకు సమాచారం లేకుండా చిరంజీవి నేతృత్వంలోని బృందం టీఆర్ఎస్ పెద్దలను కలవడం ఆగ్రహం ఆయనకు ఆగ్రహం కలిగించింది. 


దీనిపై మంత్రితో హైదరాబాదులోని భూములు పంచుకునేందుకు వారంతా వెళ్లారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్య ఇంత ఆవేశంగా మాట్లాడడం వెనుక కారణాలు చాలా నే ఉన్నాయట. సినిమా ఇండస్ట్రీ తనను పట్టించుకోకపోవడం, తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం వంటి విషయాలు బాలయ్యకు మింగుడుపడని అంశాలుగా మారాయి. మొన్నటి వరకు ఇండ్రస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న తనను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారనే భావన బాలయ్యను కంగారు పెడుతోంది. టాలీవుడ్ అంటేనే టీడీపీ అభిమానులతో నిండి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలో లేకపోవడం వంటి కారణాలతో తనను కూడా పక్కనపెట్టేలా చిరు నేతృత్వంలోని బృందం ప్రయత్నిస్తుండడం బాలయ్యకు మింగుడుపడడంలేదు.


వాస్తవంగా బాలయ్య సినిమాలు, రాజకీయాలను వేరు వేరుగా చూస్తూ ఉంటారు.ఈ రెండిటిని ముడిపెట్టేందుకు ప్రయత్నించారు. అదీ కాకుండా బసవతారకం కాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ గా కూడా ఆయన ఉన్నారు. ఆసుపత్రి అభివృద్ధి పనుల నిమిత్తం అనేకసార్లు తెలంగాణా సీఎం కేసీఆర్ ను కలుస్తూ ఉంటారు. అటువంటిది రాజకీయాలు కారణంగా చూపించి సినీ ఇండ్రస్ట్రీ పెద్దలు ఒక్కసారిగా తనను దూరం పెట్టడమే బాలయ్యకు నచ్చడం లేదు. ఆ కోపంతోనే ఇప్పుడు ఇలా ఫైర్ అయినట్టు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: