కరోనా నిన్నమొన్నటి వరకు ప్రజలకే పరిమితమైంది.. అందులో వైద్య, పోలీసు సిబ్బంది వారికి చాల తక్కువగా ఉండేది.. కానీ గత రెండు వారాల నుండి వీరిని కూడా వదిలిపెట్టకుండా ఎవరిని వదలకుండా కమ్మేస్తుంది.. ఇకపోతే తాజాగా కరోనా వ్యాప్తి నగరంలో చూస్తుంటే ఈ వర్ష కాలం వెళ్ళేలోపుగా కరోనా కేసుల సంఖ్య విపరితంగా అభివృద్ధి జరిగేలా ఉంది.. అందుకు నిదర్శనమే నమోదవుతున్న కేసుల సంఖ్య.. అదీగాక ఈ వైరస్ ఈ మధ్య వైద్య సిబ్బందిపైనా పంజా విసురుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇదివరకు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని వైద్యులకు వైరస్‌ సోకగా.. ఇప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు.

 

 

కాగా మంగళవారం ఉస్మానియా మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థుల్లో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో శనివారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు మొత్తం బాధితుల సంఖ్య 12కు చేరింది. అదీగాక నిమ్స్‌లోనూ నలుగురు వైద్య విద్యార్థులకు, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ పరిధిలోని పేట్లబురుజు ఆస్పత్రి, ఉస్మానియా, నిలోఫర్‌, చెస్ట్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న విద్యార్థుల్లో కొందరికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఉస్మానియాలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌కు, నర్సుకు ఈ వైరస్ సోకగా, గాంధీ ఆస్పత్రిలో కూడా ఒక పీజీ విద్యార్థికి పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం.

 

 

ఉస్మానియాలో భోజనం తయారు చేసే ఓ యువకుడికి కూడా వైరస్‌ సోకడంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారట. ఇక మలక్‌పేటలో నాలుగేళ్ల బాలుడు, ఎర్రగడ్డ ఆయుర్వే ఆస్పత్రిలో మంగళవారం 24 మందికి, కింగ్‌కోఠిలో 15 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఇకపోతే ఒక్క మంగళవారం రోజునే రాష్ట్రంలో కొత్తగా 99 కేసులు నమోదవగా అందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 70 కేసులు ఉండడం గమనార్హం.. పరిస్దితి ఇలాగే కొనసాగితే రాబోయేరోజుల్లో కరోనా ప్రతి గళ్లీలో తిష్టవేసుకుని ఉండటం ఖాయం అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: