చైనాలో కరోనా వైరస్ వ్యాపించినప్పుడు మనదాక రాదులే అనుకున్నాం.. కాని మొదటికేసు నమోదైనప్పుడు ఇది మనల్ని ఏం చేయదు ఒక పారాసిటమల్ ట్యాబ్లేట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని భ్రమ పడినాం.. ఆ తర్వాత కేసులు నమోదవుతుంటే భయపడిన ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా లాక్‌డౌన్ విధించాయి.. అప్పుడు మాత్రం కొవిడ్‌-19 కేసుల సంఖ్య పరిమితంగా పెరిగింది.. ఇది గత రెండు నెలల క్రితం పరిస్థితి.. కానీ ఇప్పుడా భయం ఎవరిలో కనిపించట్లేదు.. లాక్‌డౌన్‌ ఆంక్షలూ కఠినంగా లేవు, ఫలితంగా ఒకరి నుంచి మరొకరికి.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి.. వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ కరోనాకు కేరాఫ్‌గా మారుతోంది..

 

 

ఇకపోతే ఇండియా ప్రస్తుతం కరోనా కేసుల్లో టాప్ 7 లో ఉంది. ఈ స్పీడు ఇలాగే కొనసాగితే మరో నాలుగు రోజుల్లో ఇటలీని దాటి టాప్ 6లోకి వెళ్లేలా కనిపిస్తుందట. ఇక డైలీ ఈ వైరస్ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల్లో ఇండియా 5వ స్థానంలో ఉండగా,. కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉందట. అంటే ఇండియాలో మొదట్లో నెమ్మదిగా మొదలైన కరోనా ఇప్పుడు తీవ్రంగా ఉందని అనుకోవచ్చు. నిన్న భారత్‌లో 8171 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతూ 1,98,706గా నమోదయ్యాయి.

 

 

ప్రస్తుతం యాక్టివ్ కేసులు 93,323 ఉండగా, 91,818 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 5,394 మంది వ్యాధితో మరణించారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ఆ తర్వాత తమిళనాడు (23,495), ఢిల్లీ (20,834), గుజరాత్ (17,200) ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో ఈ సంఖ్య మొదటి స్దానానికి వెళ్లిన ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు.. ఎందుకంటే ఇక్కడ ఒకరి మాట ఒకరు వినని సీతయ్యలు చాలా మందే ఉన్నారు.. కాబట్టి ప్రస్తుతం ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: