ఎక్కడో చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీంటినీ కకావికలం చేస్తుంది. చంద్రమండాలన్ని చుట్టి వచ్చిన టెక్నాలజీ ఉన్నా.. ఒక చిన్న వైరస్ ని సమూలంగా నాశనం  చేయగల వ్యాక్సిన కనుగొనలేకపోతున్నారు.. అదే బలహీణత ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో మరణాలు.. కేసులు నమోదు అవుతున్నాయి. ఫిబ్రవరి మాసం లో మన దేశంలో కరోనా కేసులు మొదలయ్యాయి. మొదటి నుంచి దాన్ని అరికట్టేందుకు గట్టి చర్యలే తీసుకుంటూ వస్తున్నారు. గత నెల నుంచి భారత్ లో శరవేగంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. మొత్తం పాజిటివ్ కేసులు మంగళవారం రాత్రితో 2 లక్షలు దాటాయి. దేశంలో లక్ష కేసులు దాటిన 15 రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు లక్షలు దాటిందంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో, వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థమవుతుంది.  

 

రెండు నెలలు లాక్ డౌన్ ఎంతో సీరియస్ గా చేసిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి జనాలు ఎవరూ బయలకు రాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కానీ ఇటీవల లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి మళ్లీ కథ మొదటికి వచ్చింది.. ఇదే వేగంతో కేసులు విస్తరిస్తే, మరో 30 రోజుల్లో ఎనిమిది లక్షలు, ఆపై మరో నెల రోజుల వ్యవధిలో 32 లక్షల కేసులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  మంగళవారం ఒక్కరోజులో 200 మందికి పైగా మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 5,600కు చేరువైంది.

 

ప్రస్తుతం మొత్తం కేసుల పరంగా ఇండియా ఏడో స్థానంలో ఉంది. ఇక కరోనా కేసులలో అమెరికా 18 లక్షల కేసులతో తొలి స్థానంలో ఉండగా, ఇండియాలో వైరస్ ఇదేలా వ్యాపిస్తే, మూడు నెలల్లో అమెరికాను దాటేసే అవకాశాలు కూడా ఉన్నాయి. టెస్టులు అధికంగా జరిపితే ఇంకెన్నో వేల కేసులు వెలుగులోకి వస్తాయని వైద్య రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకుంటే, ఇండియాలో వైద్య ఉత్పాతం తప్పదని హెచ్చరించారు

మరింత సమాచారం తెలుసుకోండి: