కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలసంఖ్యలోరోజూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. రెట్టింపు వేగంతో ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. మరోవైపు దీనికి వాక్సీన్ కనుగొనడం అంత సులభంగా కనిపించడంలేదు. వాక్సీన్ వచ్చేందుకు ఇంకా ఒకటి, రెండేళ్లు పట్టే అవకాశం ఉందంటున్నారు. మరి అప్పటి వరకూ కరోనా చావులకు అడ్డుకట్ట పడేదెలా.. ?

 

 

ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటికే 3 లక్షల 80 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడమే లేదు. ఇలాంటి సమయంలో ఒకే ఒక్క కాంతిరేఖగా యాంటీ వైరల్ ఔషధం రెమిడీసివిర్ కనిపిస్తోంది. అవును.. ఈ మందు కరోనా కట్టడికి బాగానే పనిచేస్తోందని అనేక దేశాలు భావిస్తున్నాయి. వాక్సీన్ వచ్చేంత వరకూ ఈ యాంటీ వైరల్ ఔషధం రెమిడీసివిర్ వాడటం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.

 

 

అందుకే ప్రపంచ దేశాలు తమ వైద్యులకు యాంటీ వైరల్ ఔషధం రెమిడీసివిర్ ను సిఫారసు చేస్తున్నాయి. మన ఇండియా కూడా ఇందుకు ఓకే చెప్పేసింది. ఈ ఔషధం వాడేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. అయితే దీన్ని అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని కండిషన్ పెట్టింది. అది కూడా కేవలం ఐదు డోసులను మాత్రమే రోగులకు అందించాలని నిబంధన విధించింది. అత్యవసర పరిస్థితుల్లో రెమిడీసివిర్ ను వినియోగించేందుకు జూన్ 1 నుంచి అనుమతులు మంజూరు చేశామని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపారు.

 

 

ఇప్పటికే ఈ ఔషధం వాడొచ్చని అమెరికా తన వైద్యులకు సలహా ఇచ్చింది. జపాన్ కూడా తన వైద్యులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఇండియా కూడా అదే బాటలో ఉంది. అంటే.. వాక్సీన్ వచ్చే వరకూ కరోనా బారి నుంచి కాపాడే అవకాశం దీనికే ఉందన్నమాట. త్వరలోనే వాక్సీన్ అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: