రాజకీయంగా సిఎం జగన్ చాలా బలంగా ఉన్నారు. దేశంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ, కేసీఆర్, యోగి ఆదిత్య నాథ్ తర్వాత సొంతగా ఆ స్థాయిలో బలం ఉన్న నేత జగన్ ఒక్కరే. నిన్న‌టికి నిన్న దేశంలో ఉత్త‌మ ముఖ్య‌మంత్రుల జాబితాలో సీ ఓట‌ర్ చేసిన స‌ర్వేలో జ‌గ‌న్‌కు నాలుగో స్థానం రావ‌డం కూడా ఇందుకు నిద‌ర్శ‌నం. జగన్ ని ఎదుర్కోవడం అనేది విపక్షాలకు చాలా వరకు కష్టమే. అయితే పార్టీలోనే జగన్ ని ఇబ్బంది పెట్టే రాజకీయం కొన్ని శక్తులు చేస్తున్నాయి అనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. 

 

ఆవును జగన్ ని ఇబ్బంది పెట్టడానికి గానూ కొన్ని వర్గాలు ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనితో సిఎం జగన్ ఇప్పుడు ఎవరిని కూడా నమ్మే పరిస్థితిలో లేరు అని సమాచారం. ఆయన నమ్మకంగా ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఆయనను బాగా ఇబ్బంది పెట్టే రాజకీయం చేసారని టాక్. విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషయంలో జగన్ పైకి కనపడకుండా ఇబ్బంది పడ్డారు. 

 

ఇక సోషల్ మీడియాలో కొన్ని సొంత వర్గాలు తయారు అయ్యాయి. వాళ్ళు కొందరు వ్యక్తులను కీర్తించడం మొదలుపెట్టారు. ఇది జగన్ కి బాగా ఇబ్బంది గా ఉంది. గతంలో సోషల్ మీడియాను జగన్ ఎక్కువగా పట్టించుకునే వారు కాదు కాని ఇప్పుడు ఆయన అన్ని విషయాలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రతీ విషయం కూడా కొందరి ద్వారా జాగ్రత్తగా తెలుసుకుంటున్నారు అని అంటున్నారు.

 

ఇక మంత్రుల్లో ఒక‌రిద్ద‌రు తోక జాడించ‌డాలు మొద‌లు పెట్ట‌గా ఇప్ప‌టికే జ‌గ‌న్ వారికి వార్నింగ్ ఇచ్చేశార‌ట‌. ఇక వైజాగ్‌, నెల్లూరు, క‌ర్నూలు జిల్లాల్లో పార్టీ లైన్‌కు వ్య‌తిరేకంగా వెళుతోన్న ఎమ్మెల్యేలకు కూడా ఇక‌పై ఉపేక్షించ‌న‌ని వార్నింగ్ ఇచ్చార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: