విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో టీడీపీ చూపించిన ఉత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ పార్టీ ఆ ఘటన మీద చాలా ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో తనకు ఉన్న అన్ని పరిచయాలను కూడా చంద్రబాబు చాలా చక్కగా వాడుకుని ఏపీ సర్కార్ ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేసారు. కాని ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే జ‌గ‌న్ కేవ‌లం రెండు రోజుల్లో ఈ సంఘ‌ట‌న‌కు పూర్తిగా చెక్ పెట్టేసి ఎక్క‌డా చిన్న విమ‌ర్శ రాకుండా చేసి జాతీయ స్థాయిలో ఔరా అనిపించుకున్నారు.

 

దీంతో జాతీయ స్థాయి  మీడియా మేథావులు సైతం చంద్రబాబు ఎల్జీ పాలిమర్స్ విషయంలో జగన్ ని ఇబ్బంది పెట్టాలి అని చూసినా సరే అది సాధ్యం కాలేదు అని అంటున్నారు. దీనిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన దాని ప్రకారం నాలుగేళ్ల నుంచి సదరు సంస్థకు అనుమతులు లేవు. తెలుగుదేశం హయంలో కూడా అది బాగానే నడిచింది. అంటే  ఇక్కడ తెలుగుదేశం కూడా ఇబ్బంది పడుతోంది. ఈ విష‌యంలో ఏం చెప్పాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతోంది.

 

తెలుగుదేశం హయాంలో అనుమతులు లేకుండా జనావాసాల్లో ఒక కంపెనీ నడుస్తున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అనే ప్రశ్న వినపడింది. ఇది చంద్రబాబుని కచ్చితంగా ఇబ్బంది పెట్టడ౦ ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. త్వరలోనే దీనిపై విచారణ పూర్తి అయితే మాత్రం చంద్రబాబు సర్కార్ ని కూడా బోనులోకి లాగే అవకాశం ఉంది. అంటే అప్పుడు పని చేసిన అధికారులు ఇబ్బంది పడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: