వైసీపీ పార్టీలో గోదావరి జిల్లాలకు చెందిన ఓ ఎంపీ జగన్ కి పక్కలో బల్లెం లాగా మారాడు. జగన్ తీసుకునే ప్రతీ నిర్ణయానికీ వ్యతిరేకంగా వ్యవహరిస్తూ గతంలో మీడియా ముందే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సదరు ఎంపీ అదే సమయంలో బిజెపి పార్టీ పెద్దలకు ప్రముఖ నాయకులకు ఢిల్లీలో భారీస్థాయిలో విందు ఇచ్చి పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారికి ఇంగ్లీష్ మీడియం చదువు అందుబాటులోకి తీసుకురావాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా సదరు ఎంపీ అప్పట్లో  వ్యతిరేకించటం జరిగింది. అంతేకాకుండా ఇటీవల ఇసుక విధానం విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే మీడియా ఛానల్స్ కి వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తు పార్టీలో అసహనం పుట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

 

అయితే ఆ ఎంపీ ఈ విధంగా వ్యవహరించడానికి తనని వైసిపి పార్టీ సస్పెండ్ చేయాలని ఆ తర్వాత బిజెపి పార్టీతో అంట‌కాగాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో సదరు ఎంపీ తనంతట తాను వెళ్లి బిజెపి పార్టీ కండువా కప్పుకుంటే అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో పెద్ద ప్రయోజనం ఉండదని,  పార్టీయే  తనని తాను సస్పెండ్ చేసేలా ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు వైసీపీ పార్టీ వర్గాల్లో సదరు ఎంపీ అసహనం పుట్టించడానికి ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం.

 

ఆ విధంగా చేస్తే ఒకపక్క ఎంపీ గా ఉంటూనే మరో పక్క బిజెపి పార్టీలో కీలకంగా రాణించవచ్చు అని సదరు ఎంపీ యొక్క ప్లాన్ అట. అయితే ఆ ఎంపీ ఇలా చేస్తున్నాడు అని అదే నియోజకవర్గంలో వేరే ప్రముఖ నేత‌నూ పార్టీలోకి చేర్చుకుని సదరు ఎంపీకి  జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఉంటే ఉండు, పోతే పో అని!, అయినా ఆ ఎంపీ చీప్ ట్రిక్స్ మాత్రం కొన‌సాగిస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఆయన వ్యవహారం పార్టీ సస్పెండ్ చేసే దాకా ఊరుకునేలా లేడు అన్నట్టుగా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: