జగన్ అధికారంలోకి రావటమే అమరావతి కి సంబంధించిన పనులను ఎక్కడికక్కడ నిలిపి వేయడం జరిగింది. రాజధాని పేరిట గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించి అన్నిటిని ఆపివేయడం జరిగింది. వాటిపై సమీక్ష సమావేశాలు కూడా ఏనాడు జగన్ సర్కార్ పెద్దగా జరపలేదు. అమరావతి గురించి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏదైనా ఉంది అంటే అక్కడ ఉన్న భూములను ఇళ్లస్థలాలు గా మార్చి పేద వారికి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయమే.

 

అటువంటిది జగన్ ఇటీవల అమరావతి పై సరికొత్త స్కెచ్ తో ఫ్రెష్ ప్లాన్ అమలు చేయబోతున్నట్లు మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే ఇప్పటివరకు అమరావతిలో 70 శాతం కంటే పనులు పూర్తయిన భవనాలను కంప్లీట్ చేయడానికి జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులందరికీ క్వార్టర్స్, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కంప్లీట్ చేయడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో అమరావతి నిర్మాణ పనుల్లో శ్రద్ధ చూపని  జగన్ సర్కార్ తాజాగా అమరావతి పై దృష్టి పెట్టినట్లు వార్తలు రావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.

 

మొన్నటి వరకూ పరిపాలన అమరావతి నుండి వైజాగ్ తరలించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన జగన్ తాజాగా అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను కంప్లీట్ చేయాలని అనుకోవటం పట్ల రాజధాని విషయంలో జగన్ ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి జగన్ సర్కార్ సరికొత్త ఎత్తుగడ వేయబోతున్నట్లు అర్థమవుతోంది. మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ హడావుడి చేసిన జగన్ సర్కార్ తాజాగా అమరావతిలో నిర్మాణ పనులపై దృష్టి పెట్టడం తో ఏపీలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ మేధావులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: