వైసీపీ ప్రభుత్వం పైకి ఒకటి చెబుతున్న ఆచరణలో వచ్చేసరికి అంత డొల్లతనం కనబడుతున్నట్లు ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా ఇటీవల విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో సొంత పార్టీ నేతలు అధికారులపై వాళ్ల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాలో ప్రముఖ వైసీపీ పార్టీ ప్రజా ప్రతినిధి మీడియా సమావేశాలలో బహిరంగంగా ప్రభుత్వ పని తీరుపై విమర్శలు చేయడం పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయంలో లంచాలు అడుగుతున్నట్లు సొంత పార్టీ నేతలే బహిరంగ వేదికలో షాకింగ్ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇది ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందికరంగా మారింది. తాజాగా గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సొంత ప్రభుత్వం చేసిన కామెంట్లు పెను దుమారాన్ని రేపాయి.

IHG

ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటున్న గాని ఇసుక మాఫియా మాత్రం రాష్ట్రంలో చెలరేగి పోతుంది అంటూ జడ్పీ సమావేశంలో ఇసుక పాలసీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పరంగా చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమానికి కనీసం దోసెడు ఇసుక కూడా ఇవ్వలేకపోతున్నామని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం చెప్పేది ఒకలా ఉంటే వాస్తవంలో జరిగేది మరొకలా ఉంది అంటూ ఇసుక విషయంలో ప్రభుత్వం విఫలమైంది అన్నట్టుగా ఒప్పుకొన్నారు. రీచ్ నుంచి వస్తున్న ఇసుక లారీలు, రీచ్ నుంచి బయలుదేరి, అడిగిన ప్రదేశానికి రాకుండా, మధ్యలోనే మాయం అవుతున్నాయని, ఎవరికీ చెప్పలేక పోతున్నాం అంటూ, తమ పరిస్థితిని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఆవేదన వ్యక్తం చేసారు.

IHG't met 70 <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YSR CONGRESS PARTY' target='_blank' title='ysrcp-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ysrcp</a> MLAs in one year except for.. - Gossiper

సొంత పార్టీ ఎమ్మెల్యే యే ఈ విధంగా కామెంట్ లు చేయటంతో ఈ విషయం లో జగన్ దాకా వెళ్లడంతో ఆయన కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు అని టాక్. దీంతో ఇళ్ల పట్టాల విషయంలో అనేక ఆరోపణలు వస్తున్న తరుణంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 8 వ తారీఖున ఇవ్వబోయే ఇళ్ల పట్టాల కోసం లంచం అడిగితే ఫిర్యాదు చేయండి.. అంటూ 18002331077 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది.  అలాగే ఇసుక అక్రమ రవాణా సౌకర్యాలు అరికట్టడానికి కూడా సరికొత్త ఆలోచన జగన్ సర్కార్ చేయబోతున్నట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: