కరోనా వైరస్ కారణంగా ఎవ్వరూ ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలులోకి తీసుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో అన్ని వ్యవస్థలు ఎక్కడికక్కడ స్తంభించి పోవడంతో అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు . ముఖ్యంగా లాక్ డౌన్ వల్ల పేద వారు ఏ రోజుకు ఆ రోజు బతికేవాళ్ళ జీవితాలు ప్రమాదకరంలో పడ్డాయి. దేశం మొత్తం మీద ఎక్కువగా లాక్ డౌన్ వలన బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నది ఎవరు అంటే వలస కార్మికులు అని చెప్పవచ్చు. సొంత ఊరి లో పనులు లేకపోవడంతో, పొట్ట చేతబట్టుకొని ఇతర ప్రాంతాల్లో పనుల కోసం వెళ్లిన వారు లాక్ డౌన్ వలన ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం.

 

పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు లాక్ డౌన్ వలన పనులు లేకపోవడంతో సొంత ఊరు కాకపోవడంతో మరోపక్క రవాణా వ్యవస్థ స్పందించకపోవడంతో  కొన్ని కోట్ల మంది కాలి బాట పట్టడం అందరికీ తెలిసిందే. దేశంలో ఇళ్లలో  ఉన్న ప్రజలంతా వీళ్ళ కష్టాలు చూసి చలించిపోయారు. వేల కిలోమీటర్ల ప్రయాణం కాలినడకన చేయడంతో చాలా మంది సొంత ఊరికి వెళ్లలేక మధ్యలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో ప్రభుత్వాలపై ఒత్తిడిలు పెరిగాయి వలస కార్మికుల విషయంలో ఆదుకోవాలని కేంద్రం డిసైడ్ అయింది. నాలుగో దశ లాక్ డౌన్ పొడిగింపు సమయంలో రైలు ద్వారా బస్సుల ద్వారా వలస కార్మికులను సొంతూళ్లకు కేంద్రం చేర్పించింది.

 

దీని కోసం 11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అమిత్ షా ఇటీవల తెలిపారు. ఇదే టైం లో  వలస కార్మికుల విషయంలో అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . ప్రభుత్వం ఏర్పాట్లు చేసే వరకు కొంత మంది ఆగలేక వెళ్లిపోయారు వాళ్లకు ఓపిక లేకపోతే, ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు గురించి వేచి ఉండే ధోరణి లేకపోతే మేము ఏం చెయ్యాలి అని వలస కార్మికుల మృతుల విషయం పై కేంద్ర ప్రభుత్వం పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.

 

దీంతో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వాళ్లు కావాలని కాలినడకన బయల్దేరారు ఏంటి? సొంత ఊరిలో పనులు లేక వేరే ప్రాంతానికి వలస వెళ్లారు, అనుకోకుండా కరోనా  వైరస్ రావటంతో మీరు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి స్ట్రక్ అయిపోయారు. రవాణా వ్యవస్థ కూడా లేదు దీంతో అక్కడే కూర్చుని చచ్చిపోవాలా ఏంటి అని విమర్శలు చేస్తున్నారు. వలస కూలీల విషయంలో ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని అమిత్ షా అలా అనడం చాలా దారుణమని ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ప్రజలు కౌంటర్లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: